YSRCP : అక్కడ వైసీపీకి నిఖార్సయిన నాయకుడు కావాల్సిందే?
YSRCP : అప్పుడే రెండేళ్లు పూర్తయ్యాయి. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. ఇంకో మూడేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. అయినప్పటికీ.. ఇప్పటి నుంచే ఏపీలో 2024 లో వచ్చే ఎన్నికల కోసం అందరూ సంసిద్ధం అవుతున్నారు. ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన అన్ని ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంటే.. ఇప్పటికీ ఏపీ ప్రజలు సీఎం జగన్ వెంటే ఉన్నారు. వైఎస్సార్సీపీ వెంటే ఉన్నారు.. అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.
ఏది ఏమైనా.. సీఎం జగన్ కూడా ఏపీలోని అన్ని ప్రాంతాలను తన గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. ఇప్పటి నుంచే ఎన్నికల కోసం సమాయత్తమవుతున్నారు. ప్రతిపక్ష పార్టీకి ఎక్కడ చెక్ పెట్టాలో అక్కడ చెక్ పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎటూ కదల లేకుండా చేస్తున్నారు. ఎక్కడ బలమైన నేతలు ఉంటారో వాళ్లకే డైరెక్ట్ గా చెక్ పెట్టి.. తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తున్నారు సీఎం జగన్.
YSRCP : ప్రస్తుతం విజయవాడను టార్గెట్ చేసిన జగన్
ప్రస్తుతం ఏపీలోని ఏ నియోజకవర్గంలోనూ జగన్ కు తిరుగులేదు. కొన్ని ప్రాంతాల్లో మినహా.. అన్ని ప్రాంతాలు జగన్ గుప్పిట్లోకి వచ్చాయి. అయితే.. కృష్ణా జిల్లాలో ఉన్న విజయవాడ గురించే జగన్ టెన్షన్ అట. నిజానికి విజయవాడ ఎంపీ సీటును టీడీపీ గెలుచుకుంది. కృష్ణా జిల్లాలోని మిగితా అన్ని ప్రాంతాల్లో జగన్ తన మార్క్ ను చూపించినప్పటికీ.. విజయవాడలో మాత్రం చెక్ పెట్టలేకపోతున్నట్టు తెలుస్తోంది. విజయవాడ ఎంపీ కేశినేని నాని కాస్త స్ట్రాంగ్ పర్సనే. విజయవాడలో ఆయనకు ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే.. ఆయన తన సొంత పార్టీ టీడీపీకి మాత్ర ప్రస్తుతం యాంటీ అయిపోయారు. టీడీపీకి నాని యాంటీ అయినా.. విజయవాడలో స్ట్రాంగ్ కావడంతో.. నానికి చెక్ పెట్టడం కోసం.. వైఎస్ జగన్.. నిఖార్సయిన వైసీపీ నాయకుడి కోసం వెతుకుతున్నారట.
వచ్చే ఎన్నికల్లో విజయవాడ నుంచి మాంచి ఫేమ్ ఉన్న నాయకుడిని దించితేనే విజయవాడ ఎంపీ సీటు వైసీపీ కైవసం అవుతుందని జగన్ భావిస్తున్నారట. అందుకే.. ఇప్పుడు సరైన నేతను రంగంలోకి దించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో ఎన్నికలప్పుడు హడావుడిగా దించే బదులు.. ముందే సరైన నేతను రంగంలోకి దించాలని సీఎం జగన్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆ నాయకుడు.. కేశినేని నాని ఛరిష్మాను వ్యక్తిగతంగా దెబ్బకొట్టగలిగేలా ఉండాలి. మరి.. అటువంటి నాయకుడు సీఎం జగన్ కు దొరుకుతాడా? లేదా? వేచి చూడాల్సిందే.