ys jagan : ఆ టీడీపీ ముఖ్యనేతపై జగన్ ఫోకస్..! మంత్రికి బాధ్యతలు
ys jagan ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించి రెండేళ్లయింది. ఇందులో ఏడాదిన్నరగా ఆయనకు కరోనా పరిస్థితులే ఎదురయ్యాయి. అయినా.. ఈ సాకు చూపి సంక్షేమ పథకాలు మాత్రం వాయిదా వేయకపోవడం గమనార్హం. వీటన్నింటినీ పక్కపెడితే.. జగన్ రాజకీయంగా చేయాల్సింది మాత్రం చేయలేకపోయారు. కరోనా పరిస్థితులే ఇందుకు కారణం. అయినా.. గత టీడీపీ హయాంలో జరిగిన అవకతవకలపై ఆయన ముందుకెళ్తూనే ఉన్నారు. ఈక్రమంలో టీడీపీ క్యాడర్ ను కూడా వైసీపీ వైపు తీసుకొచ్చే ప్రయత్నాలు మాత్రం పెద్దగా జరగలేదు. ఇప్పటికే టీడీపీ నుంచి నలుగురు వైసీపీకి వచ్చేయగా.. కరోనా లేకపోతే ఈసరికి టీడీపీకి కోలుకోలేని దెబ్బే తగిలేదంటున్నారు.
ys jagan జగన్ చూపు అంతా టీడీపీ ముఖ్యనేతపై
ఇప్పుడు జగన్ ys jagan చూపు అంతా ప్రకాశం జిల్లా అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మీద ఉందంటున్నారు. నిజానికి ఆయన 2014లో వైసీపీ తరపునే గెలిచినా.. 2017లో టీడీపీకి వెళ్లిపోయారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు బాగా పట్టున్న ప్రకాశం జిల్లాలో అయిదు అసెంబ్లీ సీట్లు కోల్పోవడం జగన్ కు దెబ్బ. ఇందులో గొట్టిపాటి కూడా ఉన్నారు. ఆయన బలమేంటో జగన్ కు తెలుసు. జిల్లాలో రాజకీయంగా, ఆర్ధికంగా బలమైన వ్యక్తి. ఆయన టీడీపీలో ఉండటం జగన్ కు ఇష్టం లేదు. గతంలో ఆయన గ్రానైట్ ఫ్యాక్టరీలపై దాడులు జరిగినా గొట్టిపాటి పార్టీ మారలేదు. పైగా.. మంత్రి బాలినేని సాయంతో కొంతమేర కాపాడుకున్నారు. ఇప్పుడు గొట్టిపాటిని తీసుకొచ్చే బాధ్యతను బాలిరెడ్డికే అప్పజెపపారు జగన్ ys jagan.
ఇప్పటికే ఆ జిల్లా నుంచి మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, కరణం బలరామ్ టీడీపీని వీడి వైసీపీలోకి వచ్చేశారు. గొట్టిపాటిని కూడా తెచ్చుకుంటే 2024లో ప్రకాశం జిల్లాలో తమకు బలం ఉంటుందని జగన్ ఆలోచనగా చెప్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో గొట్టిపాటి పలువురు నాయకులకు ఆర్ధిక సాయం చేసారని కూడా వినికిడి. గొట్టిపాటిని తీసుకొస్తే టీడీపీకి మరింత దెబ్బ తగిలినట్టే. ఇంకా ఓటమి జీర్ణించుకోలేక పోతున్న చంద్రబాబుకు.. టీడీపీని ఇంకా దెబ్బకొట్టడం ద్వారా వచ్చే ఎన్నికలనాటికి పైచేయి సాధించాలని జగన్ ఆలోచనగా ఉంది. కరోనా లేకుంటే ఈసరికే చంద్రబాబుకు జగన్ చుక్కలు చూపించి ఉండేవారనేది రాజకీయ విశ్లేషకుల మాట.