YS Jagan : వైఎస్సార్సీపీ ప్లీనరీ.. వైఎస్ జగన్ నోట ‘సంచలన ప్రకటన’ రాబోతోందా.?
YS Jagan : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరగనుంది. ఈ ప్లీనరీ కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అధికార పార్టీ నిర్వహించే ప్లీనరీ సమావేశాలు ఎంత హంగామాతో వుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీ పరమైన కార్యక్రమమే అయినా, అధికార హంగామా కూడా చాలా ఎక్కువగానే వుంటుంది. ఇదిలా వుంటే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ ముఖ్య నేతలందరికీ వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారట. ఇప్పటికే, రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో, నియోజకవర్గాల్లో మినీ ప్లీనరలు జరుగుతున్న సంగతి తెలిసిందే.
జరగబోయేది రాష్ట్ర స్థాయి ప్లీనరీ. ఈ ప్లీనరీ ద్వారా వచ్చే ఎన్నికలకు సంబంధించి సమరశంఖం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పూరించబోతున్నారన్నది నిర్వివాదాంశం. ప్లీనరీ వేదికగా, సంచలన విమర్శలు, సంచలన ప్రకటనలు కూడా వుండబోతున్నాయి. ఇప్పటికే దత్తపుత్రుడంటూ జనసేనాని మీద విరుచుకుపడుతున్న వైఎస్ జగన్ మరింతగా, జనసేన పార్టీనీ అలాగే తెలుగుదేశం పార్టీనీ టార్గెట్ చేస్తారట. రాజకీయ విమర్శల సంగతి పక్కన పెడితే, పార్టీకి సంబంధించి కీలకమైన ప్రకటనలు వైఎస్ జగన్ చేస్తారంటూ వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

YSRCP Pleaner, YS Jagan To Announce A Sensation
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒకింత క్లారిటీ వస్తోంది. గన్నవరం నుంచి టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని వైఎస్ జగన్ మాటగా, మాజీ మంత్రి కొడాలి నాని తాజాగా ప్రకటించిన సంగతి తెలిసిందే. సిట్టింగ్ ఎమ్మెల్యేలలో దాదాపు 60 శాతం మందికి టిక్కెట్లు దక్కకపోవచ్చని జరుగుతున్న ప్రచారంపై వైఎస్ జగన్, ప్లీనరీ వేదికగా స్పష్టతనిస్తారట. మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకోసం నవరత్నాల తరహాలో మరో కొత్త ప్రకటన వైఎస్ జగన్ చేయనున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానులు సహా అనేక అంశాలపై వైఎస్ జగన్ స్పష్టతనిస్తారట.