YS Jagan : ఏపీలో జగన్ పార్టీ క్లీన్ స్వీప్ చెయ్యబోతోంది.. టీడీపీ చేసిన సర్వేలో బయటపడ్డ సంచలనం..!
YS Jagan : ఏపీలో వార్ ఇక వన్ సైడ్ అయినట్టేనా. తాజాగా వెలువడిన సర్వే ఫలితాలు చూస్తే అదే అనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు ఏపీలో ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలుస్తుంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేదానిపై టైమ్స్ నౌ ఈటీజీ అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైఎస్సార్సీపీ పార్టీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయట. అంటే ఇంచుమించు ఎంపీ స్థానాలను వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నమాట. ఇక.. కేంద్రంలో చూసుకుంటే బీజేపీ గెలుపు సునాయసం అంటూ సర్వేలో తేలింది.
కేంద్రంలో మరోసారి బీజేపీ విజయం ఖాయమని సర్వేలో తేలింది. బీజేపీ కూటమికి కనీసం 292 నుంచి 338 స్థానాలు వచ్చే అవకాశం ఉందట. కాంగ్రెస్ కు 106 నుంచి 144, ఇతర పార్టీలకు 66 నుంచి 96 వరకు సీట్లు వస్తాయట. ఇటీవల జాతీయ పార్టీగా అవతారం ఎత్తిన కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ కు 7 శాతం ఓట్ల వచ్చే అవకాశం ఉందట. పార్లమెంట్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేస్తే.. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఎందుకు క్లీన్ స్వీప్ చేయదు. ఈజీగా 175 స్థానాలకు 175 స్థానాలను ఏపీలో గెలవడం పెద్ద పనేం కాదు అని తెలిసిపోతోంది.
YS Jagan : వైనాట్ 175
నిజానికి వైనాట్ 175 అని సీఎం జగన్ చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. అదే నిజం కాబోతోంది. ఏపీలో 175 స్థానాలకు 175 స్థానాలు గెలవడం పెద్ద కష్టమేమీ కాదని తాజాగా స్పష్టమైంది. అది కూడా ఓ సర్వే సంస్థ ద్వారా వెల్లడి కావడంతో ఏపీలో మరోసారి వైసీపీ ప్రభంజనం సృష్టించబోతోంది అని స్పష్టం అవుతోంది. సీఎం జగన్ కు ఏపీ ప్రజలంతా మద్దతు ఇవ్వడానికి కారణం.. ఏపీలో సీఎం జగన్ ప్రవేశపెట్టే పథకాలు. సీఎం జగన్ పథకాలకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. బడుగు, బలహీన వర్గాలకు సీఎం జగన్ చేస్తున్న పనులను చూసి బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పడానికి ఈ సర్వేనే ఉదాహరణ.