ysrcp versus congress in andhra pradesh politics
YSRCP : కాంగ్రెస్ పార్టీ అంటే ఒకప్పుడు ఎంతో విలువ ఉండేది. దశాబ్దాల పాటు ఈ దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన పార్టీ అది. దశాబ్దాల చరిత్ర కలిగిన పార్టీ అది. భారతదేశంతో కాంగ్రెస్ పార్టీకి ఎంతో అనుబంధం ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దశాబ్దాల పాటు దేశాన్ని, తెలుగు రాష్ట్రాన్ని కూడా పాలించింది కాంగ్రెస్. ఆ పార్టీ నుంచి గొప్ప గొప్ప నాయకులు ఎదిగారు. ఎందరో గొప్ప రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టారు. కానీ.. అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా. ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవుతాయి అంటే ఇదే కాబోలు.. ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. దేశంలోనైనా.. రాష్ట్రంలోనైనా.. ఎక్కడా కాంగ్రెస్ పరిస్థితి బాగాలేదు. అసలు.. పార్టీని గాడిన పెట్టే అసలు సిసలైన నాయకుడు పార్టీకి కరువయ్యాడు. పార్టీకి చీఫే లేడు. ఏదో సోనియా గాంధీ అలా పార్టీని నెట్టుకొస్తున్నారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్న రాహుల్ గాంధీ మీద అందరూ ఆశలు పెట్టుకున్నప్పటికీ.. రాహుల్ గాంధీ కూడా అంతగా రాజకీయాల్లో రాణించలేకపోతున్నారు.
ysrcp versus congress in andhra pradesh politics
ఏపీలో చూసినా కూడా అంతే. మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఏపీలో పార్టీ కూడా కనుమరుగు అవుతూ వస్తోంది. 2014 వరకే పార్టీ ఏపీని ఏలింది. ఎప్పుడైతే ఆంధ్ర ప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిందో.. కాంగ్రెస్ పార్టీ కూడా భూస్థాపితం అయిపోయింది. 2014 నుంచి ఏపీలో దాని ఉనికియే లేదు. దీంతో.. ఆ పార్టీలో దశాబ్దాల పాటు పదవులు అనుభవించిన.. ఎందరో సీనియర్ నేతలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అసలు.. ఏ ఎన్నికల్లోనూ కనీసం డిపాజిట్లు కూడా దక్కట్లేవు కాంగ్రెస్ కు. దీంతో ఆ పార్టీ నుంచి ఇప్పటికే చాలా మంది నేతలు వేరే దారులు వెతుక్కున్నారు.
ఇక.. మిగిలిన కొందరు కూడా తొందరగా సర్దేసుకుంటే బెటర్ అని అనుకున్నట్టున్నారు. అందుకే.. ఇక మిగిలిన నేతలు కూడా వేరే పార్టీల వైపు చూస్తున్నారు. అలాగే.. విశాఖ జిల్లాకు చెందిన పేడాడ రమణి కుమారి కూడా త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేందుకు సిద్ధం అవుతున్నారట. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆమె త్వరలోనే వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది.
రమణా కుమారి.. ప్రజారాజ్యం పార్టీ నుంచి తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రజారాజ్యాన్ని చిరంజీవి.. కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. దీంతో రమణ కుమారి కాంగ్రెస్ పార్టీలో ఇఫ్పటి వరకు కొనసాగారు. ఆమె చాలా సార్లు కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. డిపాజిట్లు కూడా దక్కలేదు. అయితే.. ఆమెను ఏపీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా హైకమాండ్ నియమించడంతో అప్పటి నుంచి ఆ పదవిలోనే ఆమె కొనసాగుతున్నారు. కాకపోతే.. ఎంత చేసినా.. కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి రాజకీయ భవిష్యత్తు లేకపోవడంతో.. కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి.. వైసీపీలో చేరాలని ఆమె నిశ్చయించుకున్నారట. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతలంతా వైసీపీలోనే ఉన్నారు. విశాఖలో కాళింగ వర్గం ఓట్లు ఎక్కువ. రమణ కుమారి కూడా కాళింగ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆమెను వైసీపీలో చేర్చుకుంటే.. ఆ వర్గం ఓట్లు వైసీపీకే పడతాయిన వైసీపీ పెద్దలు కూడా ఆలోచిస్తున్నారట. చూద్దాం మరి.. ఆమె వైసీపీలో చేరుతారా? లేక వేరే దారులు వెతుకుతారా? అని.
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్‌లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్‌లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
This website uses cookies.