Anasuya : ఇందుకే కదా .. అనసూయ అంటే కుర్రాళ్ళు పడి చచ్చిపోయేది .. ఏముంది రా బాబు ఈ ఫొటోస్ లో !! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Anasuya : ఇందుకే కదా .. అనసూయ అంటే కుర్రాళ్ళు పడి చచ్చిపోయేది .. ఏముంది రా బాబు ఈ ఫొటోస్ లో !!

 Authored By aruna | The Telugu News | Updated on :23 September 2023,10:00 am

Anasuya : బుల్లితెరపై మోస్ట్ పాపులర్ యాంకర్లలో ఒకరు అనసూయ భరద్వాజ్. బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో జబర్దస్త్ షో ద్వారా ఈ బ్యూటీ ఏ రేంజ్ లో పాపులారిటీని సంపాదించుకుందో అందరికీ తెలుసు. ఈ షో ఆమెకు బాగా కిక్ ఇచ్చింది. దీనివల్లనే ఆమెకు వెండి తెరపై అవకాశాలు వస్తున్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే టాలీవుడ్ లో చాలా సినిమాలలో నటించిన అనసూయ ప్రస్తుతం పుష్ప 2 సినిమాలో నటిస్తుంది. ఇక ఆ మధ్య సముద్రఖని దర్శకత్వం వహించిన విమానం సినిమాలో ఏకంగా వేశ్య పాత్రలో చేసి ప్రేక్షకులను మెప్పించింది. ఇకపోతే అనసూయ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూ ఉంటుంది. మరీ ముఖ్యంగా కుర్రాళ్లను తన వైపుకు బాగా తిప్పుకుంటుంది. అంద చందాలతో పాటు చురుకైన మాటలతో సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. అలాగే ఎవరైనా తప్పుడు పనులు చేస్తున్నా, ఏ ఒక్కరిని వదిలేది లేదు అన్నట్లుగా వార్నింగ్ ఇస్తూ, అప్పుడప్పుడు ట్రోలింగ్ కి కూడా గురి అవుతూ ఉంటుంది. వాళ్లకి స్ట్రాంగ్ గా కౌంటర్లు కూడా ఇస్తూ ఉంటుంది. అయినా ఆమెపై ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. అవి కాస్త ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.

Anasuya latest saree pics

Anasuya latest saree pics

కనకాంబరం కలర్ శారీలో, యాష్ కలర్ జాకెట్ వేసుకొని మత్తెక్కించే చూపులతో అనసూయ హాట్ ఫోటో షూట్ చేసింది. ఈ లేటెస్ట్ పిక్స్ కుర్ర కారును నిద్రపోకుండా చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలపై అభిమానులు వివిధ రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మునుపెన్నడు లేని విధంగా అనసూయ శారీ లో అదరగొట్టేసింది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకి అభిమానులు వేలల్లో లైకుల వర్షం కురిపించారు. ఇకపోతే ప్రస్తుతం అనసూయ పుష్ప2 సినిమాలో నటిస్తుంది అలాగే సింబా, హరిహర వీరమల్లు, ఫ్లాష్ బ్యాక్ సినిమాలో నటిస్తుంది. ఈ జబర్దస్త్ భామ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది