Husband : 19 ఏళ్ల కుర్రాడితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త చేసిన ప‌నికి అవాక్కైన జనం..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Husband : 19 ఏళ్ల కుర్రాడితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త చేసిన ప‌నికి అవాక్కైన జనం..!

 Authored By ramu | The Telugu News | Updated on :7 July 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Husband : 19 ఏళ్ల కుర్రాడితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త చేసిన ప‌నికి అవాక్కైన జనం..!

Husband : భార్య వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలుసుకున్న ఓ భర్త, ఆమెను ప్రియుడితో రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవ‌డమే కాదు, వారిద్దిరికి అక్క‌డే పెళ్లి జరిపించిన విచిత్ర ఘటన బీహార్‌లో వెలుగుచూసింది. సహర్సా ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల ఆర్తికి వివాహమై ఇద్దరు పిల్లలున్నారు. ఆమె తన భర్తతో కలిసి ఓ టీ స్టాల్ నిర్వహిస్తోంది.

Husband 19 ఏళ్ల కుర్రాడితో అక్ర‌మ సంబంధం భ‌ర్త చేసిన ప‌నికి అవాక్కైన జనం

Husband : 19 ఏళ్ల కుర్రాడితో అక్ర‌మ సంబంధం.. భ‌ర్త చేసిన ప‌నికి అవాక్కైన జనం..!

Husband : బ్ర‌తికి బ‌య‌ట‌పడ్డా..

అదే టీ స్టాల్‌లో పనిచేస్తున్న 19 ఏళ్ల విశాల్ అనే యువకుడితో ఆర్తికి పరిచయం ఏర్పడి, అది వివాహేతర సంబంధానికి దారితీసింది. కొంతకాలంగా భార్య ప్రవర్తనపై అనుమానంతో ఉన్న భర్త, ఓ రోజు అర్ధరాత్రి ఆమె విశాల్‌తో సన్నిహితంగా ఉండగా పట్టుకున్నాడు.దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన భర్త, తన కుటుంబ సభ్యుల సహాయంతో వారిద్దరినీ బంధించి దాడి చేశాడు.

అనంతరం, భార్య నుదుటిపై ఉన్న సింధూరాన్ని చెరిపేసి, ఆమెకు ప్రియుడు విశాల్‌తో అక్కడికక్కడే వివాహం జరిపించాడు. ఈ ఘటనపై స్పందించిన భర్త, “భార్య చేతిలో హత్యకు గురికాకుండా బయటపడ్డాను, అదే చాలు. కానీ ఆమె నన్నే కాకుండా, ఇద్దరు పిల్లల జీవితాలను కూడా నాశనం చేసింది” అని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది