2024 Rewind : 2024 రాజ‌కీయాల‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఒకే ఒక్క వ్య‌క్తి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

2024 Rewind : 2024 రాజ‌కీయాల‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఒకే ఒక్క వ్య‌క్తి..!

 Authored By ramu | The Telugu News | Updated on :28 December 2024,5:15 pm

ప్రధానాంశాలు:

  •  2024 Rewind : 2024 రాజ‌కీయాల‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఒకే ఒక్క వ్య‌క్తి..!

2024 Rewind : మ‌రి కొద్ది రోజుల‌లో ఈ ఏడాదికి ముగింపు ప‌డ‌నుంది. 2024 ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్రవేశాయి. జిల్లా రాజకీయాలను కొత్త మలుపు తిప్పాయి. 2024 కొందరికి మధురస్మృతులను మిగిలిస్తే.. మరికొందరికి ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాలను నేర్పింది. అహంకారంతో వ్యవహారిస్తే ఎలా ఉంటుందో ప్రజలు నాయకులకు రుచి చూపించారు. ఏదైనా ఏకపక్ష నిర్ణయాలు ప్రజాస్వామ్యంలో మంచిదికాదనే సందేశాన్ని ప్రజలు ఇచ్చిన సంవత్సరంగా 2024 మిగిలిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో 2024లో జనసేన ప్రయాణం మాత్రం అంద‌రు ఆశ్చ‌ర్య‌పోయేలా చేసింది.

2024 Rewind 2024 రాజ‌కీయాల‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఒకే ఒక్క వ్య‌క్తి

2024 Rewind : 2024 రాజ‌కీయాల‌లో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన ఒకే ఒక్క వ్య‌క్తి..!

2024 Rewind స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌గా ప‌వ‌న్..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనకు, ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌కు బాగా కలిసొచ్చిన సంవత్సరం 2024గా చెప్పుకోవచ్చు. 2014లో పార్టీని పెట్టినప్పటికీ 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసి, కేవలం ఒక సీటును మాత్రమే గెల్చుకున్న పార్టీ 2024లో పోటీచేసిన 21 శాసనసభ, రెండు పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది వంద శాతం స్ట్రైక్ రేట్ సాధించింది. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఉండదని, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. ఏవిధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలో సరిగ్గా అంచనా వేయగలిగారు. తాను పోటీచేసే అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చాటడమే తన ముందున్న కర్తవ్యమంటూ ముందుకెళ్లారు. చివరకు పోటీచేసిన అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు.

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు వరకు జనసేన ఓ రాజకీయపార్టీ.. ఎన్నికల తర్వాత ఆపార్టీ ఓ శక్తిగా మారింది. సరిగ్గా 2019 ఎన్నికల తర్వాత ఏపీ ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా ఉంది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు. అధికారంలో ఉన్నా.. లేకపోయినా తాను ప్రజాసేవకుడినేనంటూ ముందుకు సాగారు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడా తొందరపాటు చూపించకుండా.. నిదానంగా ముందుకెళ్తూ.. అందుబాటులో ఉన్న వనరులతో ఏ విధంగా అభివృద్ధి చేయగలమో ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెళ్తున్నారు.

మహారాష్ట్ర ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ఇండియా (మహా వికాస్ అఘాడీ), ఎన్డీయే(మహాయుతి) కూటమి మధ్య హోరాహోరీ పోరు నడిచింది. సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఎక్కువ లోక్‌సభ స్థానాలు గెలుచుకోవడంతో శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది. తెలుగు ఓటర్లు ఎక్కువ ప్రభావం చూపించే నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని నియోజకవర్గాల్లో మహాయుతి కూటమి మంచి ప్రదర్శన కనబర్చింది. దీంతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలు దాటి జాతీయస్థాయికి వెళ్లింది. అప్పటినుంచి పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్ అంటూ జనసైనికులు నినాదాలు హోరెత్తిస్తున్నారు. మరోవైపు ఎన్డీయే సమావేశాల్లో పవన్ కళ్యాణ్‌ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తడం ఆయన ఇమేజ్‌ను దేశ స్థాయిలో మరింత పెంచింది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది