AP Politics : చిరంజీవి లాగే పవన్ కళ్యాణ్ కూడా ముంచేస్తాడు.. ఏపీ రాజకీయాలపై ఫైర్ అయిన ఓ మహిళ.. వీడియో ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

AP Politics : చిరంజీవి లాగే పవన్ కళ్యాణ్ కూడా ముంచేస్తాడు.. ఏపీ రాజకీయాలపై ఫైర్ అయిన ఓ మహిళ.. వీడియో !

 Authored By anusha | The Telugu News | Updated on :29 November 2023,3:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Politics : చిరంజీవి లాగే పవన్ కళ్యాణ్ కూడా ముంచేస్తాడు..

  •  ఏపీ రాజకీయాలపై ఫైర్ అయిన ఓ మహిళ..!

AP Politics : వైసీపీ పార్టీ కి చెందిన సాఫ్ర మేరీ ఏపీ రాజకీయాలపై మండిపడ్డారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, లోకేష్ జగన్ పై దాడి చేస్తున్నారు దీనికి మీరు ఏమంటారు అని అడిగితే.. వాళ్లు ఏం చేయలేక, సింగిల్గానే తిరుగుతాను, నేనొక్కడినే చేస్తాను అని పవన్ కళ్యాణ్ వచ్చాడు. ఇంతకుముందు వాళ్ళ అన్నయ్య వచ్చాడు. ఒక్కొక్క ఎకరం ఉన్న కాపు వర్గానికి సంబంధించిన ఒక వ్యక్తి చిరంజీవి మా కోసం వచ్చాడని బయటికి వచ్చేసి ఎకరం అమ్ముకున్నాడు. ఇప్పుడు ఒక మేక పిల్లను కొనుక్కొని కాసుకుంటున్నాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వచ్చేసాడు. ఆ మేక పిల్లను అమ్మి చిప్పలు పట్టుకొని అడుక్కోవాలి.

రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి వెళ్లి సమస్యలను తెలుసుకొని మీకు నేనున్నాను అని మీ సమస్యలన్నీ తీరుస్తాను అని హామీ ఇచ్చారు. ఇప్పుడు జగన్ కూడా సింగిల్గానే ప్రతి పథకాన్ని పెడుతూ, ప్రతి ఒక్కరి హృదయాన్ని దోచుకున్నాడు. నాకు భర్త లేకపోయినా జగనన్న వలనే నా పిల్లలతో ధైర్యంగా బ్రతుకుతున్నాను. నా ఇంటికి వచ్చి అన్ని ఇస్తున్నారు. ఇవన్నీ చూసి తట్టుకోలేక సింగిల్ గా పని అవ్వదని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురందేశ్వరి లోకేష్ వీళ్లంతా కలిసి ఏదో సాధిద్దామని తిరుగుతున్నారు. వాళ్ల వల్ల ఏమీ కాదు. ఆరోజు చిరంజీవిని నమ్ముకొని కాపులంతా చిప్పలు పట్టుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నమ్ముకుంటే అదే పరిస్థితి వస్తుంది.

జగన్ పెట్టే పథకాల గురించి తెలుసుకొని ఆయన న్యాయం చేస్తున్నాడు అన్యాయం చేస్తున్నాడు అని నిర్ణయించుకొని ముందు మీరే కళ్ళు తెరవాలి. జగన్ ఓడించాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ పురందేశ్వరి తిరుగుతున్నారు. వాళ్ల వల్ల ఏమీ అవదు. ఇంతకుముందు పురందేశ్వరి కాంగ్రెస్ లో ఉండి ఇప్పుడు టిడిపిలోకి వచ్చారు. ఆమె వేసే వేషాలెంటో, యాక్టింగ్ ఏంటో తెలియడం లేదు. చంద్రబాబుది పవన్ కళ్యాణ్ ది వెన్నుపోటు రాజకీయం. అందుకే వాళ్ళిద్దరికీ పొత్తు కుదురింది. నా భర్తకు హార్ట్ ప్రాబ్లం వస్తే రాజశేఖర్ రెడ్డి గారు సహాయం చేశారు. అలా మూడుసార్లు అడిగితే ఆయన ఇలా కాదు అని ఆరోగ్యశ్రీ కార్డు పెట్టారు. అదే చంద్రబాబును అడిగితే 10 పైసలు కూడా ఇవ్వడు అని ఆమె అన్నారు.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

anusha

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది