AP Elections 2024 : వైసీపీ గెలుస్తుందని తేల్చి చెప్పిన టీడీపీ… చంద్రబాబు పొత్తుతో వెళ్లిన కష్టమే…!
ప్రధానాంశాలు:
AP Elections 2024 : వైసీపీ గెలుస్తుందని తేల్చి చెప్పిన టీడీపీ... చంద్రబాబు పొత్తుతో వెళ్లిన కష్టమే...!
AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు వాడవేడిగా సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వచ్చే ఎన్నికల్లో జనసేన బీజేపీ టీడీపీ కూటమి గా ఏర్పడి ముందుకు సాగుతుంటే వైయస్ఆర్సీపీ ఒంటరి పోరాటం చేస్తుంది. దీంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనే అంశంపై తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రముఖ సంస్థలు సర్వే ద్వారా ముందుగానే ఆంధ్రప్రదేశ్ లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను చెబుతున్నాయి. అయితే ఇప్పటివరకు ప్రముఖ సంస్థలు విడుదల చేసిన సర్వేలలో ఈసారి కూడా వైసీపీ పార్టీ భారీ మెజారిటీతో గెలవనున్నట్లు తేల్చి చెప్పాయి.
AP Elections 2024 : వైసీపీ దే పై చేయి..
దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణస్వీకారం చేస్తారంటూ ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ తరణంలోనే తాజాగా మరో సర్వే వెల్లడించిన ఫలితాలు కూడా వైసీపీకి అనుగుణంగా ఉన్నాయని చెప్పాలి. దీంతో ఇటీవల తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కలిసి ఓట్ బ్యాంకింగ్ పై చర్చలు జరిపారు. ఇక ఈ కార్యక్రమంలో వారు తెలియజేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. 2014లో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి 47.7% ఓట్ బ్యాంకింగ్ రాగా , వైసీపీకి 45.67% ఓట్లు లభించాయి. ఆ సమయంలో టీడీపీ 2% తేడాతోనే ఘన విజయం సాధించింది. కానీ ఆ తర్వాత జరిగిన ఓట్ల చీలిక మూలాన టీడీపీ 23 సీట్లకు పడిపోయింది. లేకుంటే ఓడిపోయినప్పటికీ కనీసం 67 సీట్లు దక్కించుకునేది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో మొత్తం 175 నియోజకవర్గాలు ఉండగా దానిలో 147 స్థానాలలో బీజేపీ జనసేన టీడీపీ కలిసినప్పటికీ వచ్చే ఓట్లకి మరియు వైసీపీ ఓట్లకి 2% తేడా మాత్రమే కనిపిస్తుంది. అయితే 2019లో జరిగిన ఓట్లని ఆధారంగా చేసుకుని 2 % అధిక ఓట్లను సాధించినట్లయితే 147 కాన్స్టెన్సీలో గెలిచే అవకాశం ఉందట.
మరి ముఖ్యంగా కర్నూలు మరియు కడపలో తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసిన కూడా వైసీపీ ఓట్లకు 10 లక్షల వరకు తేడా ఉంది. ఇక్కడ చాలా పెద్ద వైడ్ మార్జిన్ ఉంది. ఈ నేపథ్యంలోనే 2019లో జరిగిన ఎన్నికల్లో 35% కంటే ఎక్కువ ఓట్లు లభించిన నియోజకవర్గాలలో టీడీపీ నాయకులు గెలుపు కోసం మరింత కసరత్తులు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా చూస్తే కూటమి క్యాడర్ మొత్తం కూడా తద్యమని చెబుతున్నాయి. అందుకే గత ఎన్నికల్లో 35% కంటే ఎక్కువ ఓట్లు లభించిన నియోజకవర్గాలలో మరింత ఫోకస్ పెంచి ఎలాగైనా సరే ఈసారి గెలిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మరి రానున్న ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిందే.