Pathapatnam : పాతపట్నంలో కొత్త పోరు.. టీడీపీ జెండా మోస్తున్న వైసీపీ నేతలు.. కారణం అదేనా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pathapatnam : పాతపట్నంలో కొత్త పోరు.. టీడీపీ జెండా మోస్తున్న వైసీపీ నేతలు.. కారణం అదేనా?

Pathapatnam : ఏపీ రాజకీయాలన్నీ ఒక ఎత్తు.. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం రాజకీయాలు ఒక ఎత్తు. ఎందుకంటే.. పాతపట్నం రాజకీయాలను ఎవ్వరూ ఊహించలేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నిజానికి రాజకీయాలే అలా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. పాతపట్నంలో అదే జరుగుతోంది. పాతపట్నంలో వైసీపీ ప్రస్తుతం బలంగానే ఉంది. అలాగని టీడీపీని కూడా తక్కువ అంచనా వేయలేం. టీడీపీ కూడా బలంగానే ఉంది. అందుకే.. అక్కడ రాజకీయాలు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉన్నాయి. […]

 Authored By kranthi | The Telugu News | Updated on :28 July 2023,7:18 pm

Pathapatnam : ఏపీ రాజకీయాలన్నీ ఒక ఎత్తు.. శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం రాజకీయాలు ఒక ఎత్తు. ఎందుకంటే.. పాతపట్నం రాజకీయాలను ఎవ్వరూ ఊహించలేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. నిజానికి రాజకీయాలే అలా ఉంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. పాతపట్నంలో అదే జరుగుతోంది. పాతపట్నంలో వైసీపీ ప్రస్తుతం బలంగానే ఉంది. అలాగని టీడీపీని కూడా తక్కువ అంచనా వేయలేం. టీడీపీ కూడా బలంగానే ఉంది. అందుకే.. అక్కడ రాజకీయాలు టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్టుగా ఉన్నాయి.

2019 ఎన్నికల్లో పాతపట్నం నుంచి వైసీపీ అభ్యర్థి రెడ్డి శాంతిని గెలిపించేందుకు వైసీపీ నేతలు తమ శాయశక్తులా కృషి చేశారు. చివరకు ఆమె గెలిచింది. కానీ.. ఎవరైతే ఆమె గెలుపునకు పాటుపడ్డారో ఇప్పుడు వాళ్లే ఆమెకు వ్యతిరేక వర్గంగా తయారయ్యారు. రెడ్డి శాంతికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు చేస్తున్నారు. దీంతో రెడ్డి శాంతికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. వాళ్లు ఆమెకు వ్యతిరేకంగా తయారవడమే కాదు.. టీడీపీ జెండాను మోస్తున్నారు. ఒకప్పుడు టీడీపీ ఓటమి కోసం కృషి చేసిన వాళ్లు ఇప్పుడు టీడీపీ జెండా మోస్తునన్నారు. దీంతో అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత అక్కడ వ్యక్తం అవుతోంది.ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. కనీసం 8 నెలల సమయం ఉంది. కానీ.. ఇప్పటి నుంచే వైసీపీ నేతలు సొంత పార్టీ ఎమ్మెల్యేపై ఎదురుతిరుగుతున్నారు. నిజానికి.. 2019 ఎన్నికల్లోనే రెడ్డి శాంతి చాలా కష్టం మీద గెలిచారు. కేవలం 1700 ఓట్ల మెజారిటీ మాత్రమే వచ్చింది.

ycp tdp

ycp tdp

Pathapatnam : సొంత పార్టీ ఎమ్మెల్యేపై రివర్స్ జెండా

అది కూడా వైసీపీ నేతల పూర్తి స్థాయి మద్దతుతో గెలిచారు. కానీ.. ఇప్పుడు పరిస్థితులు అలా లేవు. వైసీపీ నేతలు టీడీపీ జెండాలు మోస్తున్నారు. ఈనేపథ్యంలో మరోసారి అక్కడ వైసీపీ గెలుపు కష్టంగా మారింది. అంతే కాదు.. అక్కడ ఇప్పుడు టీడీపీ బలపడుతోంది. కాకపోతే టీడీపీ అభ్యర్థి ఎవరు అనేది ఇంకా డిసైడ్ కాలేదు. వైసీపీ నుంచి మళ్లీ రెడ్డి శాంతికే టికెట్ ఇస్తే అక్కడ ఆమె ఖచ్చితంగా ఓడిపోయే అవకాశం ఉంది. ఇది టీడీపీకి ప్లస్ పాయింటే కానీ.. అక్కడ వైసీపీ నేతల అసమ్మతి రాగం ఎందుకో మాత్రం తెలియడం లేదు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది