Barrelakka Sirisha : బర్రెలక్క శిరీష.. యువత నిన్ను చూసి ముందుకు రావాలి.. వచ్చే ఎంపీ ఎన్నికల్లో నా కూతుర్ని నిలబెడుతా.. తల్లి..!
ప్రధానాంశాలు:
Barrelakka Sirisha : యువత నిన్ను చూసి ముందుకు రావాలి..
వచ్చే ఎంపీ ఎన్నికల్లో నా కూతుర్ని నిలబెడుతా.. బర్రెలక్క శిరీష తల్లి..!
Barrelakka Sirisha : నాగర్ కర్నూల్ Nagarkurnool జిల్లాలోని పెద్ద కొత్తపల్లి మండలం మరికల్ గ్రామానికి చెందిన బర్రెలక్క అలియాస్ కార్నె శిరీష Barrelakka Sirsha కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. నిరుద్యోగ అంశమే ప్రధానంగా ఎన్నికల బరిలోకి దిగిన బర్రెలక్కకు కొల్లాపూర్ ప్రజలంతా సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ప్రచారానికి చాలామంది సహాయం చేశారు. పుదుచ్చేరి మాజీ మంత్రి మల్లాది కృష్ణారావు బర్రెలక్క ప్రచారానికి లక్ష రూపాయలు దాకా విరాళం ఇచ్చారు. అలాగే మరి కొంతమంది ఎన్నారైలు ఆమె ప్రచారానికి సహాయం చేస్తున్నారు.
ఇక బర్రెలక్క కూడా ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. కొల్లాపూర్ నియోజక వర్గంలోని kollapur assembly constituency ప్రతి గ్రామానికి వెళ్లి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని ఆమె తాజాగా కొల్లాపూర్ నియోజకవర్గంలోని ఓ గ్రామానికి వెళ్లారు. అక్కడ ఆమెకు చాలామంది ధైర్యం చెప్పారు. రేపు కొల్లాపూర్ నియోజక వర్గంలో గెలిస్తే బర్రెలక్క గిన్నిస్ బుక్ లో రికార్డ్ అవుతారని, యువత నిన్ను చూసి ముందుకు రావాలని, ఇది ఒక యుద్ధంలాంటిదని, నువ్వు దేనికి భయపడకు, ధైర్యంతో ముందుకెళ్ళు, రాబోయే రోజుల్లో ఎంపీ కూడా అవ్వాలని ఆమెను సపోర్ట్ చేశారు.
ఇక బర్రెలక్క Barrelakk మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యను ఎదుర్కొన్నాను. గ్రూప్ 1 పరీక్ష Group 1 రాసిన తర్వాత అన్ని పోస్ట్ పోన్ అయ్యాయి. దీంతో నాకు చాలా బాధేసింది. నాకు ఎస్సై కానిస్టేబుల్ si constable అవ్వాలని కోరిక. పోలీస్ డ్రెస్ వేసుకోవాలని చాలా ఆశ ఉండేది. దానికోసం ఎంతో చదివా, ప్రిలిమ్స్ లో కూడా మంచి మార్కులు వచ్చాయి. మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే సమయంలో నా మీద కేస్ అయింది. దీంతో నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అని ఆమె చెప్పుకొచ్చారు. మనకు తెలిసిందే గతంలో ఉద్యోగం లేక గేదెలు కాస్తున్నానని తీసిన వీడియోతో బర్రెలక్క ఫేమస్ అయ్యారు. ఆ సమయంలోనే ఈమె మీద కేస్ అయినట్టుగా తెలుస్తుంది.
