Barrelakka Sirisha : కేసీఆర్ మీద సెటైర్లు వేసిన బర్రెలక్క .. గజగజ ఒణుకుతున్నాడు అంటూ కామెంట్స్…
ప్రధానాంశాలు:
Barrelakka Sirisha : కేసీఆర్ మీద సెటైర్లు వేసిన బర్రెలక్క ..
Barrelakka Sirisha గజగజ ఒణుకుతున్నాడు అంటూ కామెంట్స్...
Barrelakka Sirisha : ఒక్క వీడియోతో సోషల్ మీడియాలో పాపులర్ అయిన బర్రెలక్క Barrelakka Sirsha ఏకంగా అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేసి పోటీ చేస్తున్నారు. నాగర్ కర్నూల్ Nagarkurnool జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం kollapur assembly constituency నుంచి బర్రెలక్క అలియాస్ శిరీష స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. తనదైన శైలిలో ప్రచారం చేస్తూ దూసుకెళుతున్నారు. ఆమెకు ప్రజలతోపాటు సోషల్ మీడియాలో కూడా విపరీతమైన ఆదరణ లభిస్తుంది. కొల్లాపూర్ లోని ప్రతి గ్రామానికి వెళ్లి బర్రెలక్క ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కొల్లాపూర్ లోని ఓ గ్రామానికి ప్రచారం నిర్వహించేందుకు వెళ్లిన బర్రెలక్క విజిల్ గుర్తుకు ఓటు వేయాలని సూచించారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ .. నేను నామినేషన్ వేసినప్పటినుంచి చాలా భయపడ్డాను. నాకు చాలా బెదిరింపు కాల్స్ వచ్చాయి. మనలాంటి వాళ్ళు ఎన్నికల్లో నిలబడితే ఇలా భయ పెట్టిస్తారా అని తెలిసింది. ఇన్ని బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటే నేను గెలుస్తానని వాళ్ళ భయం. పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి మన జీవితాల్ని నాశనం చేయబోతుందని వాళ్లకు భయమేస్తుంది. నేను చాలా నిరుపేదరాలిని, నామినేషన్ వేయడానికి కొంత అప్పు తీసుకొచ్చి వేసాను. ఎందుకంటే పేద అమ్మాయిని మీరంతా ఆదరిస్తారని నమ్మకం. ఓటుకి డబ్బులు ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేవు కానీ నేను గెలిస్తే మీకు అన్ని పనులు చేసి పెడతాను.
మీరు విజిల్ గుర్తుకు ఓటెయ్యండి చాలు అభివృద్ధి ఎందుకు రాదో నేను చూస్తాను. నేనే కాదు మిమ్మల్ని అందరిని అసెంబ్లీకి తీసుకొని వెళతాను. మనకు కావలసినవి మనం తెచ్చుకుందాం. ఇక్కడ విద్య, వైద్యం, రోడ్లు సరిగా లేవు, నేను గెలిస్తే అవన్నీ చేస్తాను, నేను తాత( కేసీఆర్)తో పోరాడాలంటే మీరు నన్ను గెలిపియాలి. ఈ ఊర్లో రోడ్లు సరిగ్గా లేవు. మీరు ఎవరిని అడగలేదా.. మీరు దేనికి భయపడొద్దు. 25 సంవత్సరాల అమ్మాయి నైన నేను 70 సంవత్సరాలు ఉన్న వారిని గడగడ వణికిస్తున్నా, ఈమె గెలిచేటట్టుగా ఉంది ఈమెను పక్కకు లాగేద్దాం అని నా తమ్ముడు పై దాడి చేశారు. అయినా నేను వెనుకడుగు వేయలేదు. అధైర్య పడలేదు అని బర్రె లెక్క చెప్పుకొచ్చారు.