TDP Janasena : పదవుల కోసం టీడీపీ-జనసేన మధ్య రసవత్తర పోటీ.!
TDP Janasena : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఇప్పుడు పరిపాలన సాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య మంచి వాతారణం ఉన్నా కూడా గ్రౌండ్ లెవల్‌లో మాత్రం పదవుల కోసం పోటీ పడుతున్నారు. నామినేటెడ్ పదవులు ఏపీలో దండీగా ఉన్నాయి. అవి వందల కొద్దీ ఉండడంతో అందరి దృష్టి వాటిపై పడింది. ప్రెస్టేజ్ తో కూడా పోస్టులు కేబినెట్ ర్యాంక్ పోస్టులు కూడా చాలా ఉన్నాయి. తెలుగు తమ్ముళ్ళు జనసైనికులు బడా కుర్చీలకే టార్గెట్ పెడుతున్నారు. ఆ వరసలో తిరుపతిలోని తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తుడా చైర్మన్ పదవి కోసం పోటీ పెద్ద ఎత్తున సాగుతోంది అని అంటున్నారు.
TDP Janasena మరీ అంత పోటీనా..
తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు జనసేనకు చెందిన వారు కావడంతో తుడా ఛైర్మన్ పదవి జనసేనకే పోతుందని టాక్ నడుస్తుంది. తిరుపతిలో ఈ పదవి మీద ఆశలు పెంచుకున్న తమ్ముళ్ళు తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారని , ఆ పదవిని అంత ఆశామాశీగా పోనివొద్దని అంటున్నారు. ఈ పదవి తమకే కావాలని రెండు పార్టీలకు చెందిన నాయకులు పోటీ పడడంతో ఒక చిన్న సైజు వార్ అయితే స్టార్ట్ అయిపోయింది అని అంటున్నారు. శాసన మండలిలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల చేసింది. జూలై 12న ఈ రెండు స్థానాలకు ఎన్నిక జరగనుంది.
ఈ నేపథ్యంలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూటమికే దక్కనున్నాయి. ఎందుకంటే ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఎమ్మెల్యే కోటా స్థానాలు. ఎమ్మెల్యేలు వీరిని ఎన్నుకుంటారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో 164 సభ్యుల బలం కూటమికి ఉంది. దీంతో రెండు ఎమ్మెల్సీ స్థానాలు కూటమి ఖాతాలో పడనున్నాయి. కాగా రెండు ఎమ్మెల్సీ స్థానాలను టీడీపీ, జనసేన పంచుకున్నాయి. టీడీపీ తరఫున రాయలసీమ నేత, మాజీ ఎంపీ సి.రామచంద్రయ్య, జనసేన తరఫున డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కార్యదర్శి పిడుగు హరిప్రసాద్ ను అభ్యర్థులుగా ఎంపిక చేశారు. సి.రామచంద్రయ్య ఎన్నికల ముందు వరకు వైసీపీలో ఉన్నారు. తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. ఇక హరిప్రసాద్ కు ఇదే మొదటిసారి పదవి అవుతుంది.