Botsa Satyanarayana : కలవరపెడుతున్న యాంటీ సెంటిమెంట్.. ప్రతిపక్ష నేతగా మారాక బొత్స ఏం చేయనున్నాడు..!
ప్రధానాంశాలు:
Botsa Satyanarayana : కలవరపెడుతున్న యాంటీ సెంటిమెంట్.. ప్రతిపక్ష నేతగా మారాక బొత్స ఏం చేయనున్నాడు..!
Botsa Satyanarayana : ఏపీ శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ ఎన్నికయిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేతగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్ కు పంపడంతో శాసన మండలి ప్రతిపక్ష నేతగా బొత్సను గుర్తించాలని ఛైర్మన్ కు లేఖ రాయనున్నారు వైఎస్ జగన్. సీనియర్ నేత బొత్స ఎమ్మెల్సీగా ఎన్నికైన నేపథ్యంలో ఆయన కోసం తన పదవిని త్యాగం చేశానని అప్పిరెడ్డి చెప్పారు. తన విన్నపాన్ని తొలుత తమ అధ్యక్షుడు జగన్ అంగీకరించలేదని… అయినప్పటికీ తన విన్నపం మేరకు జగన్ ఆమోదించారని తెలిపారు. జగన్ వైసీపీని స్థాపించినప్పటి నుంచి తాను ఆయనతోనే ఉన్నానని చెప్పారు. జగన్ ఆశీస్సులతోనే తాను మార్కెట్ యార్డ్ ఛైర్మన్ గా ఉన్నానని తెలిపారు. ఎమ్మెల్సీ పదవి కూడా జగన్ వల్లే వచ్చిందని చెప్పారు. జగన్ నాయకత్వంలోనే తాను పని చేస్తానని తెలిపారు.
Botsa Satyanarayana ఏం జరగబోతుంది..
బొత్స సత్యనారాయణ మండలి ప్రతిపక్ష నేతగా ఉంటే మంచి జరుగుతుందన్నారు. ఇచ్చిన హామీలను టీడీపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని, ఇలాంటి సమయంలో సీనియర్ అయిన బొత్స ప్రతిపక్ష నేతగా ఉంటే ప్రజలకు మంచి జరుగుతుందని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అన్నారు. విశాఖ నుంచి శాసనమండలికి ప్రతిపక్ష నేతగా నెగ్గిన రెండవ వారు బొత్స ఎంపిక అయ్యారు అని చెప్పాలి. అయితే బొత్స కంటే ముందు దాడి వీరభద్రరావు శాసనమండలిలో టీడీపీ పక్షం నుంచి ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఆయన 2007 నుంచి 2012 వరకూ అయిదేళ్ల పాటు పనిచేయగా, అతనికి స్థానిక సంస్థల కోటాలోనే ఎమ్మెల్సీ అయ్యారు. తర్వాత చంద్రబాబు అతనికి మళ్లీ రెన్యువల్ చేయకపోవడంతో ఆగ్రహించి అధినాయకత్వంపై కోపంతో వైసీపీలో చేరారు.
అయితే అప్పుడు చంద్రబాబు ఏపీలో ప్రతిపక్షనేతగా ఉన్నారు. అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ కంటే మండలి అపోజిషన్ లీడర్ కే ప్రోటోకాల్ లో అగ్ర తాంబూలం ఇస్తారు. చంద్రబాబు కంటే ఎక్కువ హోదానే నాడు దాడి అనుభవించగా, చివరికి ఆయన పార్టీ నుండి దూరం కావడంతో బాబుకు రాజకీయంగా కొంత ఇబ్బంది కూడా కలిగింది. సీన్ కట్ చేస్తే బొత్స కూడా సీనియర్ నేత. ఆయన సైతం స్థానిక కోటా నుంచే ఎమ్మెల్సీ అయ్యారు. మండలిలో విపక్ష నేతగా ఉంటున్నారు. అప్పట్లో చంద్రబాబు మాదిరిగానే ఇపుడు జగన్ కూడా అసెంబ్లీలో విపక్షంలో ఉన్నారు. కాకపోతే జగన్ కి ప్రతిపక్ష హోదా లేదు.ఇప్పుడు జగన్ కన్నా కూడా బోత్సాకే హొదా ఉంటుంది. మరి ఇవన్నీ జగన్ తట్టుకోగలుగుతారా అన్నది చర్చనీయాంశంగా మారింది.