Botsa Satyanarayana : ఉన్నట్టుండి బొత్స మౌనానికి కారణం ఏంటి.. అసలు ఏం జరుగుతుంది?
ప్రధానాంశాలు:
Botsa Satyanarayana : ఉన్నట్టుండి బొత్స మౌనానికి కారణం ఏంటి.. అసలు ఏం జరుగుతుంది?
Botsa Satyanarayana : వైసీపీలో కీలక నేతగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. ఆయనకి సార్వత్రిక ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం రూపంలో మళ్లీ లక్ తగిలింది.ఆ మీదటా శాసనమండలిలో ప్రతిపక్ష నేత హోదా కూడా దక్కింది. దీంతో ఇక ఆయన నంబర్ టూ గా వైసీపీలో ఉంటారు అని అంతా అనుకున్నారు. టీడీపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడతారని అందరు అన్నారు. కాని ఎందుకో బొత్స ఈ మధ్య చాలా సైలెంట్ అయ్యారు.అనూహ్యంగా వరించిన ఎమ్మెల్సీ.. ఆపై మండలిలో ప్రతిపక్ష నేత హోదా. ఇక చెలరేగిపోతాడని భావించిన బొత్స ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. తనకు అత్యంత సన్నిహితుడైన అప్పిరెడ్డిని తప్పించి బొత్సను ప్రతిపక్ష నేతగా ప్రతిపాదించడంతో వైసీపీలో ఇక ఆయనే నెంబర్ టూ కాబోతున్నారు అని సంకేతాలు ఇచ్చారు జగన్.
Botsa Satyanarayana మౌనానికి ఇది కారణమా ?
దాంతో వైసీపీకి సంబంధించి బొత్స చక్రం తిప్పుతారని అనుకుంటే అంచనాలను తలకిందులు చేస్తూ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిపోయారు. ఎమ్మెల్సీ అయిన తర్వాత బొత్స మీడియా ముందుకు వచ్చి చాలా రోజులైంది. ఆమధ్య బెజవాడ వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన ఆయనను బాధితులు నిలదీశారు. ఇంత ఆలస్యంగా ఏ మొహం పెట్టుకొని వచ్చారని నిలదీయడంతో చేసేదేం లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. అప్పటి నుంచి ఆయన మీడియా ముందుకు రావడం లేదు.. జగన్ తో కలిసి వైసీపీని ముందుకు తీసుకెళ్తారని అనుకుంటే ఆయన గప్ చుప్ కావడం పట్ల పార్టీలో చర్చ జరుగుతోంది.

Botsa Satyanarayana : ఉన్నట్టుండి బొత్స మౌనానికి కారణం ఏంటి.. అసలు ఏం జరుగుతుంది?
అయితే ప్రజల నుంచి నిలదీతలు ఎదురవ్వడంతోనే బొత్స సడెన్ సైలెంట్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై రాజకీయం చేస్తే ప్రజల్లో మరింత పలుచన అవుతామని…దూకుడుగా రాజకీయం చేయడం వలన ప్రజల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది అని మౌనం వహిస్తున్నారని అంటున్నారు. అదే సమయంలో ఆయన చీపురుపల్లిలో ఓటమి పాలవ్వడంతో అక్కడ అనుచరులను కాపాడుకోవడంపై దృష్టి పెట్టడంతోనే సైలెంట్ అయ్యారని బొత్స సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. వైసీపీలో ఇటీవల అనేక మంది సీనియర్ నేతలు పార్టీని వదిలి పోతున్నారు. అదే విధంగా మొదటి నుంచి పార్టీలో ఉన్న వారు కూడా సైలెంట్ అయ్యారు. శాసనమండలిలో చూస్తే వైసీపీ ఎమ్మెల్సీలు ఎంతమంది ఉంటారో కూడా తెలియడం లేదు. దీంతోనో ఆచీ తూచీ స్పందించాలని భావించే బొత్స కొంత తగ్గి ఉంటారని అంటున్నారు