అవినీతి చక్రవర్తితో భోజనమా..? సుబ్రహ్మణ్యస్వామిపై బుద్ధా ఫైర్
Buddha venkanna : బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి నిన్నటి రోజునా ఏపీ సీఎం జగన్ మోహన్ తో ప్రత్యేకంగా భేటీ అవ్వటం రాజకీయంగా దుమారం లేపుతుంది. భేటీ అనంతరం టీడీపీ మరియు టీడీపీ అనుకూల మీడియా మీద సుబ్రహ్మణ్యస్వామి చేసిన వ్యాఖ్యలు పట్ల తెలుగుదేశం పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ అవినీతి ముఖ్యమంత్రులను జైలుకు పంపిన సుబ్రహ్మణ్యస్వామి, అవినీతి చక్రవర్తితో కలిసి భోజనం చేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన అవినీతి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఆయన 16నెలలు జైల్లోఉండివచ్చారు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అవినీతికి పరాకాష్టగా మారిపోయారు. ప్రత్యేక విమానంలో తిరుమలకు వచ్చిన సుబ్రహ్మణ్యస్వామి, స్వామివారినికూడా దర్శించుకోకుండా జగన్ తో కలిసి వేడివేడి భోజనంచేసి, రహస్యమంతనాలుజరిపి, తిరిగి ఢిల్లీవెళ్లిపోయారు.
సుబ్రహ్మణ్యస్వామి ఇతరుల అవినీతి గురించి మాట్లాడేముందు, ఆయన ప్రత్యేకవిమానం ఖర్చులు ఎవరు భరించారో ఆయనే చెప్పాలి. రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన తిరుపతికి వచ్చి రహస్యమంతనాలు జరిపారని అర్థమవుతోంది. ఎవరితో కలిసి ఆయన వేడివేడి భోజనం చేశారో, ఆసమయంలో ఏంచర్చించారో ఆయనే బహిర్గతంచేయాలి. తనదారి ఖర్చులను సుబ్రహ్మణ్యస్వామే పెట్టుకున్నారా? లేక భోజనం పెట్టినవారే భరించారా? ఇదివరకు సుబ్రహ్మణ్యస్వామి పై ప్రజలకు గౌరవముండేది. అంటూ బుద్ధా వెంకన్న పేర్కొన్నాడు.
అవినీతిచక్రవర్తితో కలిసి ఆయన ఎప్పుడైతే భోజనాలు చేశారో, అప్పుడే ఆయనపైఉన్న గౌరవం పోయింది. దేవాదాయ ఆస్తులను ఎందుకు అమ్ముతున్నారని సుబ్రహ్మణ్యస్వామి జగన్ ను అడిగారా? పింక్ డైమండ్ ఏమైందని, రాష్ట్రంలో 165కుపైగా దేవాలయాలపై దాడులు ఎందుకు జరిగాయని సుబ్రహ్మణ్యస్వామి, జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాడా?
సుబ్రహ్మణ్యస్వామి ఏదో రాజకీయప్రయోజనం ఆశించే జగన్ తోసమావేశమైనట్టు, జగన్ ఆయన్ని ప్రలోభపె ట్టినట్టు అనిపిస్తోంది. ఎందరో అవినీతి ముఖ్యమంత్రులను గతంలో జైలుకు పంపిన సుబ్రహ్మణ్యస్వామి, నేడు ఈ విధం గా ప్రవర్తించడం సిగ్గుచేటు. జగన్మోహన్ రెడ్డిపై పోరాడుతోంది తెలుగుదేశం పార్టీ, ఆపార్టీ నేతలు మాత్రమేననే వాస్తవాన్ని సుబ్రహ్మణ్యస్వామి తెలుసుకోవాలంటూ బుద్ధా వెంకన్న హితవు పలికాడు.
రాష్ట్రంలోని ప్రసారమాధ్య మాలు, పత్రికలతోపాటు, జాతీయ పత్రికలను చూస్తే, ఆయనకు వాస్తవాలు బోధపడతాయి. టీడీపీ మాట్లాడటం లేదని సుబ్రహ్మణ్యస్వామి చెప్పడం విడ్డూరానికే విడ్డూరం. ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే, జగన్ తో లాలూచీ పడినట్టుగా ఉంది. సుబ్రహ్మణ్యస్వామి తనపార్టీతో సంబంధంలేకుండా ప్రత్యేకవిమానంలోవచ్చిమరీ, జగన్మోహన్ రెడ్డితో సమావేశ మవ్వాల్సిన సందర్భం ఏమొచ్చింది?
రాష్ట్రానికి హడావుడి గా వచ్చి, ఏదేదోచెప్పాల్సిన అవసరం ఆయనకు ఏమొచ్చిం ది? చంద్రబాబునాయుడిపై గతంలో రాజశేఖర్ రెడ్డి అనేక ఆరోపణలుచేసి, లెక్కకు మిక్కిలి కేసులువేసి, భంగపడ్డాడనే వాస్తవాన్ని, ఇప్పుడు కేసులువేస్తానంటున్న సుబ్రహ్మణ్య స్వామి గ్రహించాలి.
సుబ్రహ్మణ్యస్వామికి చేతనైతే, అవినీతి ని, అవినీతికిపాల్పడిన జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించాలి. చంద్రబాబునాయుడిని, ప్రజలపక్షాన పోరాడుతున్న ఆయ న తీరుని ప్రశ్నించడం మానేస్తే మంచిది. సుబ్రహ్మణ్యస్వామి తనవయసుని, అనుభవాన్ని గుర్తుంచుకొని తనకున్న గౌరవాన్ని కాపాడుకుంటే మంచిదని సూచిస్తున్న అంటూ చెప్పాడు బుద్ధా వెంకన్న.