YS Jagan Master Plan : టెక్కలి నియోజికవర్గంలో జగన్ మాస్టర్ ప్లాన్ ఇదే, ఆ ఫ్యామిలీకి ఎర్త్ పెట్టబోతున్నాడు..!
YS Jagan Master Plan : ఏపీలో ఎన్నికలకు ఇంకా సంవత్సరమే సమయం ఉంది. ఈనేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికల కోసం సమాయాత్తమవుతున్నాయి. ఇప్పటికే కొన్ని పార్టీలు తమ పార్టీల అభ్యర్థులను కూడా ఖరారు చేస్తున్నాయి. ఈనేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ప్రతిపక్ష, అధికార పార్టీ అభ్యర్థులు ఖరారయ్యారు. టీడీపీ నుంచి టెక్కలి నియోజకవర్గంలో పోటీ చేసేది అచ్చన్నాయడు అని తెలుసు కదా. ఆయన తప్ప ఇంకెందరు బరిలోకి దిగరు. ఎందుకంటే.. టెక్కలి ఆయనకు కంచుకోట. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా గెలుస్తూ వచ్చారు. కాబట్టి ఇప్పుడు కూడా అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు.
అయితే.. వరుసగా రెండు సార్లు గెలిచినా నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదని అంటున్నారు ప్రజలు. అసలు ఆయన టీడీపీకి అధ్యక్షుడు అయ్యాక టెక్కలిని పట్టించుకున్న పాపాన పోలేదు అని కూడా అంటున్నారు. అదే అచ్చన్నకు మైనస్ పాయింట్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక.. అధికార పార్టీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ పార్టీ నుంచి దువ్వాడ శ్రీనివాస్.. టెక్కలి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అవకాశం కాదు.. ఆయనే టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థి అని సీఎం జగన్ కూడా ప్రకటించారు.
YS Jagan Master Plan : అచ్చెన్న, దువ్వడ మధ్య తీవ్రమైన పోటీ
దీంతో అచ్చెన్నాయుడు, దువ్వాడ మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉంది. అయితే.. వైసీపీ నుంచి చాలామంది టెక్కలి టికెట్ ను ఆశించారు. కానీ.. ఈసారి దువ్వాడ శ్రీనివాస్ కే టెక్కలి టికెట్ ను జగన్ ప్రకటించారు. ఇద్దరిలో మరి ఎవరు గెలుస్తారు.. అనేది పక్కన పెడితే ఎన్నికల హడావుడి ఇప్పటి నుంచే మొదలైంది. అయితే టెక్కలిలో అచ్చెన్నాయుడుకి చెక్ పెట్టడం కోసం సీఎం జగన్ వేసిన ఎత్తుగడ ఇది అని చెప్పుకోవాలి. అయితే.. 2024 ఎన్నికల్లో ఇద్దరిలో ఎవరు గెలుస్తారు అనేదానిపై మాత్రం క్లారిటీ లేదు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.