Chirumarthi Lingaiah : చిరుమర్తి లింగయ్యకు భారీ షాక్.. ఆయన అనుచరులంతా హస్తం గూటికి.. ఈసారి ఓటమి తప్పదా?
ప్రధానాంశాలు:
నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు ఎదురుదెబ్బ
కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమేనా?
ఎందుకు బీఆర్ఎస్ ను నాయకులు వీడుతున్నారు?
Chirumarthi Lingaiah : అసలు తెలంగాణలో ఏం జరుగుతున్నదో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. ఒకటే దారి ఉంది అన్నట్టుగా బీఆర్ఎస్, బీజేపీ నుంచి నేతలంతా కాంగ్రెస్ లో చేరుతున్నారు. కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. కాంగ్రెస్ తప్పితే మరో పార్టీ లేదు అన్నట్టుగా కాంగ్రెస్ లోకి వరుసగా నేతలు క్యూ కడుతున్నారు. బీఆర్ఎస్ కు చెందిన నేతలు చాలా మంది ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. వాళ్లు కూడా కీలక నేతలు కావడం గమనార్హం. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన చాలామంది బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ లో చేరారు. మరోవైపు బీజేపీ నుంచి కూడా కీలక నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారు. అధికారం దిశగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుండటంతో ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. బూత్ స్థాయిలో ప్రభావం చూపే గ్రామ స్థాయి నేతలు కూడా కాంగ్రెస్ లో చేరుతున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. తాజాగా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన పలువురు గ్రామ స్థాయి నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది.
నకిరేకల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి చిరుమర్తి లింగయ్య అభ్యర్థిగా బరిలో నిలవగా.. వేముల వీరేశం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరి కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా టికెట్ పొందిన విషయం తెలిసిందే. దీంతో నకిరేకల్ లో ఈసారి గట్టి పోటీ నెలకొన్నది. వేముల వీరేశంకు పోటీ ఇవ్వాలంటే బీఆర్ఎస్ చాలా కష్టపడాలి. ఎన్నికలకు ఇంకా 25 రోజులే ఉండటంతో బీఆర్ఎస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ కాంగ్రెస్ లోకి చేరికలు మాత్రం ఆగడం లేదు. ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరగా.. తాజాగా నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చిరుమర్తి లింగయ్య ప్రధాన అనుచరులే కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమవుతుండటంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతలు షాక్ కు గురయ్యారు.
Chirumarthi Lingaiah : రామన్నపేట మండలం బీఆర్ఎస్ నేతలు హస్తం గూటికి
నియోజకవర్గంలోని రామన్నపేట మండలానికి చెందిన బీఆర్ఎస్ నేతలు హస్తం గూటికి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. రామన్నపేట మండలం జెడ్పీటీసీ, మండల అధ్యక్షుడు, ఎనిమిది గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు పార్టీ మారేందుకు ప్లాన్ చేస్తున్నారట. వీళ్లంతా రెండు మూడు రోజుల్లో కారు దిగి హస్తం పార్టీలో చేరనున్నట్టు తెలుస్తోంది. దీంతో ఎమ్మెల్యే కంగుతిన్నట్టు తెలుస్తోంది. పార్టీ మారుతున్న నేతల స్థానాలను భర్తీ చేయలేక.. నియోజకవర్గంలో తంటాలు పడుతున్నారు. చూడాలి మరి.. ఏం జరుగుతుందో?