Rythu Bandhu : బిగ్ బ్రేకింగ్.. రైతుబంధుపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు ..!
Rythu Bandhu : రైతు బంధు నిధులను రైతుల ఖాతాలో విడతల వారీగా జమ చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు మట్టి విక్రమార్క Deputy CM Bhatti Vikramarka తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన రైతులకు ఆర్థిక సహాయం అందించడం కోసం రోజువారీగా రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఒక ఎకరం భూమి ఉన్న పేద రైతులు 27 లక్షల మందికి రైతుబంధు నిధులు విడుదల అని అన్నారు. ఇప్పుడు రెండు ఎకరాల భూమి ఉన్న రైతులకు రైతుబంధు నిధులు విడుదల చేస్తున్నామన్నారు. ఈ మేరకు నిధులు ఆయా రైతుల ఖాతాలో జమ అవుతాయని బట్టి విక్రమార్క అన్నారు. రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు ఒకేసారి జమ చేయడానికి నిధుల కొరత అడ్డుగా మారింది. ఖజానాలో డబ్బులు లేకపోవడంతో రైతుబంధు ఒకేసారి ఇవ్వలేకపోతున్నాం అని అన్నారు. వాస్తవంగా ఎన్నికల ముందు రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమవుతాయని బీఆర్ఎస్ సర్కార్ పెద్దలు ప్రకటించారు.
అయితే ఆనాటి ఎన్నికల కమిషన్ కోడ్ కారణంగా రైతుల ఖాతాలో జమ చేయవద్దని ఎన్నికల షెడ్యూల్ ముగిసిన తర్వాత రైతుల ఖాతాలో జమ చేసుకోవాలని ఎన్నికల కమిషన్ తెలిపింది. అయితే రైతుబంధు కోసం ఖజానాలో జమ అయిన డబ్బులు అలాగే ఉంటాయని భావించిన రేవంత్ రెడ్డి ఆనాడు పిసీసీ అధ్యక్షుడు హోదాలో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. కానీ డిసెంబర్ 7వ తేదీన సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డికి అదే రోజు ఖజానా ఖాళీగా కనిపించింది. ఆర్థిక శాఖ అధికారులు తాపీగా వచ్చి నయా పైసా కూడా లేదు సార్ అని రేవంత్ కు సమాధానం ఇచ్చారు. దీంతో ఏం చేయాలో పాలు పోనీ పరిస్థితి రేవంత్ రెడ్డికి ఏర్పడింది. రైతు బంధు కోసం జమ చేసిన డబ్బులని పాత ప్రభుత్వం ఖర్చు చేస్తుందని
తాము అధికార పగ్గాలు చేపట్టే వరకు ఎలాంటి ఖర్చులు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ను కోరింది. కాంగ్రెస్ పార్టీ భయపడినట్లుగానే ఖజానా ఖాళీగా దర్శనం ఇచ్చింది. దీంతో శ్వేత పత్రం విడుదల చేయాలని నిర్ణయించింది. శ్వేత పత్రం విడుదల చేసింది. రైతుబంధు కోసం జమ చేసిన సొమ్మును అనుకూల కాంట్రాక్టర్లకు చెల్లింపులు చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. ఒకవైపు ఖాళి ఖజానా మరోవైపు అప్పులు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో వచ్చిన ఆదాయంతోనే ప్రస్తుతానికి రాష్ట్రాన్ని ముందుకు నడుపుతున్నారు. మరోవైపు కేంద్రం వద్ద కొత్త అప్పుల కోసం రేవంత్ సర్కార్ ఆర్జీ పెట్టింది. కేంద్రం కనికరిస్తే రైతుబంధు నిధులతో సహా ఇతర పథకాలకు కూడా నిధుల కొరత తీరుతుంది. ఈలోపు వచ్చే ఆదాయంలో రైతుబంధుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి రైతు ఖాతాలో నిధులు జమ చేయాలని రేవంత్ ప్రభుత్వం నిర్ణయించింది. ముందుగా ఎకరం రైతులకు రైతుబంధు ఇవ్వగా ఇప్పుడు రెండు ఎకరాలు రైతులకు రైతుబంధు ఇచ్చారు ఇలా విడతల వారీగా రైతుబంధు నిధులను రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు.