73 Years Old Woman : అనారోగ్యంతో ఆసుపత్రికి 73 ఏళ్ల మహిళ.. సీటీ స్కాన్ చూసి…!
ప్రధానాంశాలు:
73 Years Old Woman : అనారోగ్యంతో ఆసుపత్రికి 73 ఏళ్ల మహిళ.. సీటీ స్కాన్ చూసి...!
73 Years Old Woman : 73 ఏళ్ల మహిళ కడుపులో 30 ఏళ్లుగా ఉన్న కల్సిఫైడ్ ఫీటస్‌ను(రాతి బిడ్డ) చూసిన వైద్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవల ఈ సంఘటనకు సంబంధించిన సీటీ స్కాన్ చిత్రాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, విస్తృతంగా వైరల్ అయ్యాయి. ఈ అరుదైన పరిస్థితిని లిథోపీడియాన్ అని పిలుస్తారు. ఇది ఎలా జరుగుతుంది అంటే గర్భధారణ సమయంలో గర్భం గర్భాశయంలో కాకుండా కడుపులో (ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ) ఏర్పడితే, తగిన రక్త సరఫరా లేక గర్భం పెరగకపోవచ్చు.

73 Years Old Woman : అనారోగ్యంతో ఆసుపత్రికి 73 ఏళ్ల మహిళ.. సీటీ స్కాన్ చూసి…!
73 Years Old Woman : ఏంటి ఇది..
అటువంటి గర్భాన్ని శరీరం సహజంగా బయటకు పంపలేకపోతే, రక్షణ చర్యగా ఆ శిశువును శిలాజం మాదిరిగా మార్చేస్తుంది. మన రోగనిరోధక వ్యవస్థ దీనిని నిర్వహిస్తుంది . శరీరానికి హానికరమైన పదార్థాలను నివారించేందుకు ఈ విధంగా స్పందిస్తుంది. ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో అత్యంత అరుదైనవే. 2013లో కొలంబియాలో ఒక 82 ఏళ్ల మహిళ గర్భం విఫలమై, 40 ఏళ్ల పాటు శరీరంలోనే శిలాజంగా మారిన శిశువు కలిగిన ఘటన గుర్తించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కేసులు ఇప్పటివరకు కేవలం 300 చుట్టూ మాత్రమే నమోదయ్యాయి అని వైద్య గణాంకాలు చెబుతున్నాయి. ఇంతకాలం ఆ మహిళకు ఎలాంటి సమస్య లేదు. అత్యంత అరుదైన ఈ వైద్య పరిస్థితి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.