Dwakra Group : డ్వాక్రా సంఘాల్లో మీరు చేరలేదు.. ఇప్పుడే చేరండి..రూ. 5 లక్షలు దక్కించుకోండి..!
ప్రధానాంశాలు:
Dwakra Group : డ్వాక్రా సంఘాల్లో మీరు చేరలేదు.. ఇప్పుడే చేరండి..రూ. 5 లక్షలు దక్కించుకోండి..!
Dwakra Group : మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. డ్వాక్రా గ్రూప్‌లకు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. 5 లక్షల వరకు రుణాలను మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మహిళలు స్వయం ఉపాధిని అభివృద్ధి చేసుకోవడానికి, వాణిజ్య, వ్యవసాయ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ఈ నిధులు ఉపయోగపడనున్నాయి. అంతేకాకుండా, డ్వాక్రా సభ్యులకు ఉచిత బీమా, సులభ రుణ అవకాశాలు, కొత్త మహిళలను గ్రూప్‌లలో చేర్చేందుకు ప్రోత్సాహం లభిస్తోంది.

Dwakra Group : డ్వాక్రా సంఘాల్లో మీరు చేరలేదు.. ఇప్పుడే చేరండి..రూ. 5 లక్షలు దక్కించుకోండి..!
ఈ పథకం ప్రకారం డ్వాక్రా సభ్యులుగా చేరి 6 నెలలు పూర్తయిన వారికి రూ. 5 లక్షల వరకు బ్యాంక్ రుణం లభిస్తుంది. అంటే 10 మంది సభ్యులున్న ఒక గ్రూప్‌కు ఒక్కొక్కరికి రూ. 50 వేలు రుణం అందించనున్నారు. కాలానుగుణంగా డ్వాక్రా గ్రూప్ లింకేజీ రుణ పరిమితి పెరుగుతూ, రూ. 20 లక్షల వరకు రుణాలు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ రుణాలను పొందాలంటే, బ్యాంక్ లావాదేవీలు క్రమంగా నిర్వహించడం, నెలవారీ పొదుపు చేయడం, రుణ వాయిదాలను సమయానికి చెల్లించడం వంటి నిబంధనలను పాటించాల్సి ఉంటుంది.
గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ కొత్త కార్యవర్గాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మొదట గ్రామస్థాయిలో, ఆ తర్వాత మండల స్థాయిలో కార్యవర్గాలను ఏర్పరచి డ్వాక్రా సంఘాల నిర్వహణ మరింత మెరుగుపరచనుంది. గ్రామాల్లో ఈ ప్రక్రియ మార్చి 12 నాటికి పూర్తి చేయనున్నారు, అదే రోజు మండల స్థాయి కార్యవర్గాలను ఎన్నుకోనున్నారు. ఇకపై డ్వాక్రా సభ్యత్వ వయస్సు 18 నుంచి 15 ఏళ్లకు తగ్గించే ప్రణాళిక ఉంది, దీని వల్ల పెద్ద సంఖ్యలో యువతులు డ్వాక్రా గ్రూప్‌లలో చేరేందుకు అవకాశం లభించనుంది. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుని, ఆర్థిక స్వావలంబన సాధించాల్సిన అవసరం ఉందని అధికారులు సూచిస్తున్నారు.