Manmohan Singh Passed Away : భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూత | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Manmohan Singh Passed Away : భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూత

 Authored By ramu | The Telugu News | Updated on :26 December 2024,11:25 pm

Manmohan Singh Passed Away : ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన మన్మోహన్ సింగ్.. అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన ఎయిమ్స్ ఆసుపత్రి . మాజీ ప్రధాని గురువారం మృతి చెందిన వార్త దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. మన్మోహన్ 92 ఏళ్ల కాంగ్రెస్ సీనియర్ నేత అస్వస్థతకు గురవడంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు.

Manmohan Singh Passed Away భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూత

Manmohan Singh Passed Away : భారత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ కన్నుమూత

2004-2014 మధ్య కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ సమయంలో పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నారు. 1991-92 మధ్య పీవీ నర్సింహారావు హయంలో ఆర్థికమంత్రిగా పని చేశారు. దేశంలో ఆర్థిక సంస్కరణలు అప్పుడే వచ్చాయి.

మన్మోహన్ సింగ్ 1932లో పాకిస్థాన్ (దేశ విభజనకు ముందు)లోని గహ్ ప్రాంతంలో జన్మించారు. పీవీ నర్సింహారావు హయాంలోని ఎల్‌పీజీ (లిబరైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్) సంస్కరణల రూపశిల్పిగా ఘనత సాధించారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది