White Ration Card : తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుద్యోగ యువతకు యూనియన్ బ్యాంక్ శుభవార్త… ఉచితంగా ఉద్యోగ శిక్షణ…!
ప్రధానాంశాలు:
White Ration Card : తెల్ల రేషన్ కార్డు ఉన్న నిరుద్యోగ యువతకు యూనియన్ బ్యాంక్ శుభవార్త...ఉచితంగా ఉద్యోగ శిక్షణ...!
White Ration Card : నిరుద్యోగ యువతకు తాజాగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త తీసుకువచ్చింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగ శిక్షణ కార్యక్రమాలను నిర్వహించేందుకుగాను యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే చిత్తూరు జిల్లా గ్రామీణ ప్రాంత యువతకు ఈ సంస్థ సూపర్ గుడ్ న్యూస్ తెచ్చింది. ఇక ఈ కార్యక్రమం ద్వారా నేటి యువతకు ఫోటోగ్రఫీ మరియు వీడియోగ్రఫీలపై నెలరోజుల పాటు ఉచితంగా శిక్షణ అందించనున్నారు. అయితే ఈ శిక్షణ పొందాలంటే కచ్చితంగా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలని అధికారులు తెలియజేస్తున్నారు. మరి దీనికి సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం..
White Ration Card : తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి…
రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు తెల్ల రేషన్ కార్డ్ కలిగి ఉన్న వారికి మాత్రమే అనేక రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. రేషన్ పంపిణి నుండి అనేక రకాల పథకాలకు అర్హత పొందాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. ఈ నేపథ్యంలోనే యూనియన్ బ్యాంక్ కూడా తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి ఉచితంగా ఉద్యోగ శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఇది అన్ని జిల్లాలకు వర్తించదని సమాచారం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ ఈ ఆఫర్ ను కేవలం 2 జిల్లాలకు మాత్రమే కల్పించింది
White Ration Card : ప్రత్యేకించి 2 జిల్లాలకు మాత్రమే…
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అవకాశాన్ని కేవలం చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలకు మాత్రమే అందించనుంది. ఇక ఈ రెండు జిల్లాల్లో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న నిరుద్యోగ యువతకు మహిళలకు ఉద్యోగ శిక్షణ ఇవ్వనున్నారు. అయితే ఈ శిక్షణ అనేది యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ చంద్రగిరిలో ఇవ్వనున్నట్లు సమాచారం.
ఈ క్రమంలోనే ఏప్రిల్ 10వ తేదీ నుండి ఉద్యోగ శిక్షణ తరగతులు ప్రారంభం కానుండగా ఈ కార్యక్రమం ద్వారా నిరుద్యోగ యువతకు దాదాపు నెలరోజుల పాటు ఫోటోగ్రఫీ వీడియోగ్రాఫీ లపై అధికారులు శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ అనేది కేవలం పురుషులకు మాత్రమే ఉంటుంది. అంతేకాక ఈ అవకాశాన్ని కేవలం తిరుపతి మరియు చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారికి మాత్రమే కల్పిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు.
White Ration Card : అర్హులు ఎవరంటే….
యూనియన్ బ్యాంక్ ప్రవేశపెడుతున్న ఈ ఉచిత ఉద్యోగ శిక్షణకు చిత్తూరు మరియు తిరుపతి జిల్లాల్లోని 19 నుండి 45 సంవత్సరాల పురుషులు మాత్రమే అర్హులు అవుతారు. అంతేకాక వారు ఖచ్చితంగా 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇక ఈ ఉద్యోగ శిక్షణ పూర్తి ఉచితంగా ఉంటుంది. అలాగే అభ్యర్థులకు ఉచిత భోజనం మరియు వసతి కూడా కల్పిస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత సర్టిఫికెట్ కూడా జారీ చేస్తారు. కావున అర్హత కలిగి ఉన్నవారు ఆధార్ కార్డు ఫోటోలతో మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.