Husband Wife : ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు..? అని అడిగినందుకు భర్తను చంపిన భార్య..!
ప్రధానాంశాలు:
తండ్రి సాయంతో కట్టుకున్న భర్తను చంపిన భార్య
Husband Wife : ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు..? అని అడిగినందుకు భర్తను చంపిన భార్య..!
Husband Wife : ఒకప్పుడు భర్త చేతిలో భార్య హతం అనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు కాలం మారింది. భార్య చేతిలో భర్త హతం అనే వార్తలు ప్రతి రోజు పదుల సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. అక్రమ సంబంధాలు దీనికి ప్రధాన కారణం. కట్టుకున్న భర్త, పిల్లలు ఉన్నప్పుడు కొంతమంది మహిళలు పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధం పెట్టుకొని కట్టుకున్న భర్తను , కన్న బిడ్డలను హతమారుస్తున్నారు. తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.

Husband Wife : ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావు..? అని అడిగినందుకు భర్తను చంపిన భార్య..!
Husband Wife ఫోన్లో ఎవరు..? అని భర్త అడగడంతో కోపంతో భర్త ను అతి దారుణంగా చంపిన భార్య
వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో రెడ్డిపల్లి వెంకటేష్ (33) అనే వ్యక్తి జయశ్రీ అనే మహిళను 11 సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, మూడు సంవత్సరాల క్రితం భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో, జయశ్రీ పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. గ్రామ పెద్దల చొరవతో రెండు నెలల క్రితం ఇద్దరూ సమాధానంగా కలిసివుండేందుకు అంగీకరించారు. భార్యాపిల్లలతో కలిసి వెంకటేష్ జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు.
జూలై 21వ తేదీ ఆదివారం రోజు బోనాల పండుగ సందర్భంగా వెంకటేష్ రాత్రి 11 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో జయశ్రీ ఫోన్లో మాట్లాడుతుండగా, వెంకటేష్ ఆమెను ఎవరితో మాట్లాడుతున్నావని ప్రశ్నించాడు. దీంతో వారిద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ పరిస్థితిలో జయశ్రీ తన భర్త చేతులు పట్టుకోగా, ఆమె తండ్రి పండరి వెంకటేష్ గొంతు నులిమి అక్కడికక్కడే హతమార్చాడు. ఇతరులకు విషయం తెలియకుండా ఉండేందుకు సోమవారం ఉదయం జయశ్రీ, ఆమె తండ్రి మృతదేహాన్ని ఆటోలో తరలించే ప్రయత్నం చేశారు. కానీ వెంకటేష్ తల్లి మరియు సోదరులు ఈ అనుమానాస్పద ప్రవర్తనను గమనించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి, వెంకటేష్ తల్లి ఫిర్యాదు మేరకు జయశ్రీ, ఆమె తండ్రిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.