Ap Politics : ఇన్ని వ్యతిరేకతల మధ్య వైసీపీ విజయం సాధ్యమేనా… సాధ్యమైతే.. ? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ap Politics : ఇన్ని వ్యతిరేకతల మధ్య వైసీపీ విజయం సాధ్యమేనా… సాధ్యమైతే.. ?

 Authored By ramu | The Telugu News | Updated on :28 May 2024,2:30 pm

Ap Politics : ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత ఈసారి కూడా తాము మళ్లీ అధికారం చేపడతామంటూ వైసీపీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. దీనికి గల కారణం ఓటింగ్ శాతం ఎక్కువగా పోల్ అవ్వడం అని కొందరు అంటున్నారు. అంతేకాక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మహిళలు వృద్ధులు వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేశారని చెబుతున్నారు. జగన్ ఐదేళ్లపాటు పాలనకి ప్రజల నుంచి మంచి మద్దతు లభించిందని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ మాటలన్నీ వైసీపీ శ్రేణుల్లో బాగా వినిపిస్తున్నప్పటికీ బాహ్య ప్రపంచాన్ని గమనించినట్లయితే ఆ వాతావరణం మొత్తం వేరేగా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కీలకమైన సెక్షన్స్ అన్నీ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ ఉద్యోగులు వేసిన ఓటింగ్ శాతం కూటమికే ఎక్కువగా పడినట్లు తెలుస్తోంది. వారితో పాటు వారి యొక్క కుటుంబ సభ్యులు ఓటింగ్ కూడా కూటమికి పడినట్లుగా తెలుస్తోంది. ఈ విధంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో కనీసం నలుగురు ఉన్న దాదాపు 15 లక్షల దాకా అవుతున్నారు. ఇక వీరు వారి యొక్క సన్నిహితులను స్నేహితులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంది. అంతేకాక ఈసారి కొత్త ఓటర్లు కూడా అధికంగా ఉండడంతో వారి యొక్క ఓటు కూడా కూటమికే పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో మేధావులు ,చదువుకున్నవారు ప్రైవేట్ ఉద్యోగులు,వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Ap Politics ఇన్ని వ్యతిరేకతల మధ్య వైసీపీ విజయం సాధ్యమేనా సాధ్యమైతే

Ap Politics : ఇన్ని వ్యతిరేకతల మధ్య వైసీపీ విజయం సాధ్యమేనా… సాధ్యమైతే.. ?

అలాగే ఈసారి సామాజిక వర్గాల పరంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ శాతం ఉన్న కాపు వర్గాలన్నీ కూడా మెజారిటీ ఓట్లను కూటమికే వేసినట్లుగా అంటున్నారు. ఈ క్రమంలోనే కాపు వర్గానికి చెందినవారు 50 లక్షలకు పైగా ఉన్నప్పటికీీ వారిలో కనీసం 40 లక్షల కోట్లు కూటమికి పడి ఉంటాయని అంచనా వేస్తున్నారు. మరోవైపు బీసీలలో వైసీపీకి టీడీపీకి మంచి పట్టున్నప్పటికీ కూటమికి కూడా ఏడ్జ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ లోటును ఎస్సీ ఎస్టీ మైనారిటీలతో భర్తీ చేసుకోవచ్చని వైసీపీ భావిస్తుంటే , వారిలో కూడా తమ వాట పెరిగిందంటూ కూటమి చెప్పుకొస్తుంది.

ఈ విధంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై రెండువైపులా మంచి లాజిక్ తో కూడిన వాదనలు వినిపిస్తున్నాయి. ఈ విధంగా రెండు వైపులా గెలుపు అవకాశాలకు చెబుతున్న కారణాలు అర్థవంతంగా ఉన్నాయి. పైగా ఈసారి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ శాతం రాజకీయ వాతావరణం వైసీపీకి వ్యతిరేకంగా మారిందన్న వార్తలు వచ్చాయి. మరి ఈ ప్రతికూల వాతావరణం ఎదుర్కొని ఈసారి జగన్ ఏపీలో విక్టరీ సాధిస్తారా అంటే ఎన్నికల ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది