Kirak RP Vs Kodali Nani : ఒరేయ్ ఆర్పీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు…లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వస్తే పోలీసులదే బాధ్యత.. కోడాలి నాని…! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Kirak RP Vs Kodali Nani : ఒరేయ్ ఆర్పీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు…లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వస్తే పోలీసులదే బాధ్యత.. కోడాలి నాని…!

Kirak RP Vs Kodali Nani : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వెలువడి కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ రాజకీయ వేడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నికలకు ముందు కంటే కూడా ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల ఇరు పార్టీల అభిమానులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దాడులు కూడా చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాజకీయ ప్రముఖులు సైతం ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :10 June 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Kirak RP Vs Kodali Nani : ఒరేయ్ ఆర్పీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు...లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వస్తే పోలీసులదే బాధ్యత.. కోడాలి నాని...!

Kirak RP Vs Kodali Nani : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల ఫలితాలు వెలువడి కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ రాజకీయ వేడి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. వాస్తవంగా చెప్పాలంటే ఎన్నికలకు ముందు కంటే కూడా ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పలుచోట్ల ఇరు పార్టీల అభిమానులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో దాడులు కూడా చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా రాజకీయ ప్రముఖులు సైతం ఒకరిపై ఒకరు దుర్భాషలాడుకోవడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మనం చూడవచ్చు. అయితే జబర్దస్త్ వేదికగా మంచి గుర్తింపు సాధించి అనంతరం పెద్దారెడ్డి చాపల పులుసు పేరుతో బిజినెస్ ప్రారంభించి బాగా ఫేమస్ అయిన కిరాక్ ఆర్పీ ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాలలో కూడా జోరుగా పాల్గొంటున్న విషయం అందరికీ తెలిసిందే.

ఇప్పటికే కిర్రాక్ ఆర్పీ వైసీపీ నాయకులను ఉద్దేశించి పలు రకాల విమర్శలు చేయగా ఇటీవల కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ ప్రెస్ మీట్ వేదికగా మాట్లాడుతూ వైసీపీ నాయకులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మరిముఖ్యంగా కొడాలినాని , మంత్రి రోజా ను ఉద్దేశిస్తూ కిర్రాక్ ఆర్పీ చేసిన వ్యాఖ్యలు ఆంధ్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఎవరు ఊహించిన విధంగా కిర్రాక్ ఆర్పీ వైసీపీ నేతల గురించి మాట్లాడుతూ పచ్చి బూతులు తిట్టడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిందని చెప్పడంలో ఎలాంటిి సందేహం లేదు. అయితే తాజాగా ఆర్పీ వ్యాఖ్యలపై కొడాలి నాని స్పందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వైసీపీ పార్టీకి చురుగ్గా పనిచేసేటువంటి నేతలపై టీడీపీ నేతలు దాడి చేస్తున్నారని , రాత్రి సమయంలో వారి ఇండ్లకు వెళ్లి బెదిరింపులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీని సమూలంగా నాశనం చేసేందుకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారని, దీనిలో భాగంగానే ఉద్దేశ పూర్వకంగా వైసీపీ నేతలను కించపరుస్తూ మాట్లాడుతున్నారని వారిపై దాడులు చేస్తున్నారని కొడాలి నాని తెలిపారు.

Kirak RP Vs Kodali Nani ఒరేయ్ ఆర్పీ నిన్ను వదిలే ప్రసక్తే లేదులా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వస్తే పోలీసులదే బాధ్యత కోడాలి నాని

Kirak RP Vs Kodali Nani : ఒరేయ్ ఆర్పీ నిన్ను వదిలే ప్రసక్తే లేదు…లా అండ్ ఆర్డర్ ప్రాబ్లెమ్ వస్తే పోలీసులదే బాధ్యత.. కోడాలి నాని…!

అంతేకాక వైసీపీ నేతలపై దాడులు చేస్తున్నారని దానికి ప్రత్యేక సాక్షులు పోలీసులేనని కానీ వారు మాత్రం వైసీపీ నేతలను టీడీపీ గుండాలు వచ్చి కొడుతుంటే నిలబడి చూస్తున్నారు తప్ప ఏమి చేయడం లేదంటూ చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో లేకపోయినప్పటికీ ప్రశ్నించే గొంతు కచ్చితంగా తమదవుతుందని మరో కొన్ని రోజుల్లో మా నేతలపై దాడి జరిగిన ప్రదేశాలకు మేము వస్తామని అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే దానికి పోలీసులే బాధ్యత వహించాలంటూ ఈ సందర్భంగా కొడాలి నాని తెలిపారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ వేడి హోరాహోరీగా కొనసాగుతూ కనిపిస్తుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది