చిన్నవాడైన జగన్ ను చూసి నేర్చుకో కేసీఆర్ : కోమటిరెడ్డి కౌంటర్లు
komatireddy venkate reddy : తెలంగాణ లో నాగార్జున సాగర్ ఎన్నికల వేడి తారా స్థాయికి చేరుకుంది. అధికార పక్షము, ప్రతిపక్షము మాటల యుద్దానికి దిగాయి. తాజాగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సీఎం కేసీఆర్ పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఎన్నికల సందర్భంగా హాలియా లో జరిగిన కేసీఆర్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు జరుగుతుంటే ఆ ఎన్నికల కంటే కూడా ప్రజల ఆరోగ్యమే ప్రధానమని భావించిన సీఎం జగన్ తన సభను వాయిదా వేసుకున్నాడు, కానీ ఈ ముఖ్యమంత్రి ఒక రాక్షసుడిగా వ్యవహరిస్తూ, మనిషికి 500 రూపాయలు ఇచ్చి, లక్ష మందితో సభ పెడుతున్నాడు. చిన్నవాడైన జగన్ ను చూసి కేసీఆర్ నేర్చుకోవాలి అంటూ నిప్పులు చెరిగాడు వెంకటరెడ్డి.
komatireddy venkate reddy : శ్రీకాంత్ చారి తల్లికి ఇవ్వచ్చు కదా..?
కేసీఆర్ పెద్ద బలవంతుడు అని చెపుతారు, అలాంటి వ్యక్తి సొంత బిడ్డను ఎందుకు గెలిపించుకోలేకపోయాడు. ఎంపీ గా కవిత ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చుకున్నాడు. ఆ పదవి ఎదో తెలంగాణ కోసం మొదటిసారి అశువులు బాసిన శ్రీకాంత్ చారి తల్లికి ఇవ్వచ్చు కదా..? 2014 లో ఓడిపోతామని తెలిసిన నియోజకవర్గంలో ఆమెను పోటీకి దించిన కేసీఆర్ ఆ తర్వాత ఆమెకు ఏమైనా పదవి ఇవ్వచ్చు కదా..? 2001 లో పార్టీ పెట్టిన సమయంలో కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వస్తది, తెలంగాణ వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి, కాపలా కుక్కగా ఉంటానని చెప్పాడు.. కానీ చివరికి ఏమి చేశాడంటూ ధ్వజమెత్తాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
కేసీఆర్ ఎదో పెద్ద మహాత్మా గాంధీ అన్నట్లు నా సొంతవూరు అంటూ వెళ్లి, ఇంటికి పదిలక్షలు ఇచ్చాడు. తెల్లారేసరికి 138 కోట్లు ఇచ్చారు. కేసీఆర్ సొంతవూరిలోనే పేదవాళ్ళు ఉన్నారా..? పక్క ఊరిలో ఎవరు లేరా..? ఇదో పిచ్చి పాలన, మొన్న కేటీఆర్ మాటలు విన్నాను, మా నాన్నను తిడితే ఊరుకోను అని అన్నాడు.. ఇప్పుడు నేను తిడుతున్న ఏమి చేస్తాడో చేయమను, తెలంగాణ వస్తే కాపలా కుక్కలా ఉంటానని చెప్పి గద్దల ఎందుకు దోచుకుతింటున్నావు అంటూ వెంకటరెడ్డి తీవ్ర పదజాలంతో కేసీఆర్ మీద విరుచుకుపడ్డాడు.. మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలకు తెరాస నేతలు ఏమని కౌంటర్లు ఇస్తారో చూడాలి.