జనసేనలో చేరబోతున్న వైఎస్సార్ ఆప్తమిత్రుడు.. జగన్ కు ఇది షాకింగే? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

జనసేనలో చేరబోతున్న వైఎస్సార్ ఆప్తమిత్రుడు.. జగన్ కు ఇది షాకింగే?

Konathala Ramakrishna : మీకు కొణతాల రామకృష్ణ గుర్తున్నారా? ఆయన ఏపీ రాజకీయాల్లో చాలా సీనియర్. ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా ఉన్నారు. కీలకమైన మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలను ఆయన శాసించారనే చెప్పుకోవాలి. కానీ.. ఎప్పుడైతే వైఎస్సార్ చనిపోయారో అప్పటి నుంచి కొణతాల రాజకీయాలు కాస్త ఇబ్బందికరంగా మారాయి. నిజానికి 2009 ఎన్నికల్లోనూ కొణతాల ఓడిపోయారు. మంత్రిగా ఉన్నా కూడా ఆయన […]

 Authored By kranthi | The Telugu News | Updated on :19 July 2023,4:10 pm

Konathala Ramakrishna : మీకు కొణతాల రామకృష్ణ గుర్తున్నారా? ఆయన ఏపీ రాజకీయాల్లో చాలా సీనియర్. ఆయన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా ఉన్నారు. కీలకమైన మంత్రిత్వ శాఖలను ఆయన నిర్వహించారు. ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలను ఆయన శాసించారనే చెప్పుకోవాలి. కానీ.. ఎప్పుడైతే వైఎస్సార్ చనిపోయారో అప్పటి నుంచి కొణతాల రాజకీయాలు కాస్త ఇబ్బందికరంగా మారాయి. నిజానికి 2009 ఎన్నికల్లోనూ కొణతాల ఓడిపోయారు. మంత్రిగా ఉన్నా కూడా ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత వైఎస్సార్ మరణం.. దీంతో రాజకీయాల్లో ఆయన నెమ్మదించారు.

కానీ.. వైఎస్సార్ మీద అభిమానంతో ఆయన కొడుకు జగన్ పార్టీలో చేరారు. ఆ పార్టీలోనూ కీలకంగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లోనూ అనకాపల్లి నుంచి వైసీపీ తరుపున తన సోదరుడిని బరిలో నింపాడు కానీ.. తన సోదరుడు గెలవలేదు. దీంతో వైసీపీ నుంచి కూడా ఆయన బయటికి వచ్చేశారు. ఆ తర్వాత 2019 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. టీడీపీకి ఆయన ప్రచారం చేశారు. కానీ.. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలవలేదు.2019 ఎన్నికల్లోనూ టీడీపీ ఓడిపోవడంతో కొణతాలకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన టీడీపీలో యాక్టివ్ గా లేరు. కానీ.. ఇప్పుడు త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అవనున్నారు కొణతల. 2024 ఎన్నికల విషయంలో కొణతల రామకృష్ణ కీలకమైన నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

ycp

ycp

Konathala Ramakrishna : ఈసారి జనసేనలో చేరబోతున్న కొణతాల

అందుకే ఆయన జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈనెల 20న జనసేన పార్టీలో చేరుతారని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి నుంచి జనసేన తరుపున ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అనకాపల్లిలో కొణతాల సామాజికవర్గం ఎక్కువగా ఉండటం వల్ల అది కొణతాలకు ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. అందుకే జనసేన కూడా కొణతాలను చేర్చుకొని అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాలని భావిస్తోందట. జగన్ కు ఆప్తుడు అయిన కొణతాల ఇప్పుడు జనసేనలో చేరితే పరిస్థితులు ఎలా మారుతాయో వేచి చూడాల్సిందే.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది