KTR : చంద్రబాబు భజన మొదలు పెట్టిన కేటీఆర్.. దేనికంటారు..!
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు చంద్రబాబు భజన చేయడం చర్చనీయాంశంగా మారింది.గతంలో చంద్రబాబుని విమర్శించన వాళ్లు సడెన్‌గా చంద్రబాబు భజన ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. అయితే రాష్ట్రానికి రూ. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు తనపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఎన్నిక కేసులు పెట్టినా.. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ […]
ప్రధానాంశాలు:
KTR : చంద్రబాబు భజన మొదలు పెట్టిన కేటీఆర్.. దేనికంటారు..!
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు చంద్రబాబు భజన చేయడం చర్చనీయాంశంగా మారింది.గతంలో చంద్రబాబుని విమర్శించన వాళ్లు సడెన్‌గా చంద్రబాబు భజన ఎందుకు చేస్తున్నారు అనేది ఎవరికి అర్ధం కావడం లేదు. అయితే రాష్ట్రానికి రూ. లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చినందుకు తనపై కేసులు పెడతారా? అని ప్రశ్నించారు. ఎన్నిక కేసులు పెట్టినా.. కాంగ్రెస్ హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటానని అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మాట్లాడారు.ఫార్ములా ఈ కారు రేస్ వ్యవహారంలో ఒప్పందం కుదరడానికి ముందే నిధులు చెల్లించడం.. అందులోనూ నిబంధనలకు విరుద్ధంగా విదేశీ కరెన్సీ రూపంలో ఇవ్వడంపై విచారణ వేగవంతమైన నేపథ్యంలో కేటీఆర్ ఈ మేరకు స్పందించారు.
KTR ఎందుకు ఈ భజన..
జైలుకెళ్లేందుకైనా తాను సిద్ధమని అన్నారు. జైల్లో పెడితే యోగా చేసి.. పాదయాత్రకు సిద్ధపడతానని చెప్పారు. రాజ్‌భవన్‌లో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటవుతున్నాయని, ఆ రెండు పార్టీలు కలిసి బీఆర్ఎస్‌ను ఖతం చేసేందుకు యత్నిస్తున్నాయని ఆరోపించారు. భారత్‌లో ఫార్ములా 1 రేసింగ్ నిర్వహించాలని 2003లోనే చంద్రబాబు ఆశించారని, కానీ, నిర్వాహకులు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో సాధ్యం కాలేదని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత మళ్లీ తాను వాళ్లతో మాట్లాడినా ప్రయోజనం లేకపోయిందన్నారు. అందుకే ఎలక్ట్రిక్ వాహనాలతో నిర్వహించే ఫార్ములా ఈ కారు రేసింగ్ నిర్వహించామని కేటీఆర్ తెలిపారు. కామన్వెల్త్ గేమ్స్ అనగానే కాంగ్రెస్ చేసిన కుంభకోణాలు గుర్తుకువస్తాయని కేటీఆర్ విమర్శించారు. ఈ కామన్వెల్త్ కుంభకోణంలో సురేశ్ కల్మాడి జైలుకు కూడా వెళ్లాడని కేటీఆర్ గుర్తు చేశారు. ఓ మంచి ఉద్దేశంతో హైదరాబాద్‌లో ఫార్ములా ఈ రేస్ నిర్వహిస్తే.. దానిపై ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు.
25 ఏళ్ల క్రితం చంద్రబాబు ‘జీనోమ్ వ్యాలీ’ని స్థాపించారు. భారత్ బయోటెక్ వ్యవస్థాపకుడు డాక్టర్ కృష్ణ ఎల్లా జీనోమ్ వ్యాలీ భావనను ఎన్నో సార్లు పొగిడారు. అంతేకాకుండా.. లైఫ్ సైన్సెస్ రంగంలో రీసెర్చ్, డెవలప్‌మెంట్, మానుఫ్యాక్చరింగ్ సౌకర్యాలను కలిపి ఓ ప్రత్యేక బయోటెక్ హబ్‌ను రూపొందించాలని ప్రతిపాదించారు. దాంతో చంద్రబాబు జీనోమ్ వ్యాలీని స్థాపించి విజన్‌ను సాకారం చేశారు అంటూ కేటీఆర్ ..చంద్రబాబుని మెచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది,ట్విట్టర్ వేదికగాను చంద్రబాబుని కేటీఆర్ కొనియాడడం చర్చనీయాంశంగా మారింది. ఎందుకిలా అంటూ పలువురు ముచ్చటించుకుంటున్నారు.