Vangalapudi Anitha : ఓవర్ యాక్షన్ చేసిన టీడీపీ నేత వంగలపూడి అనితకు చుక్కలు చూపించిన లేడీ ఎస్పీ
Vangalapudi Anitha : టీడీపీ నేత వంగలపూడి అనిత తెలుసు కదా. తను టీడీపీ నేత. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు. ఆమె ప్రజా స్పందన కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో కలెక్టర్ నిర్వహించే ప్రజా స్పందన కార్యక్రమానికి వెళ్లకుండా తనను అడ్డుకున్నారు. ప్రజా స్పందన కార్యక్రమానికి వెళ్లకుండా అనుమతి ఇవ్వకుండా తననున వైజాగ్ లోని డాక్టర్స్ కాలనీలో ఉన్న ఆమె నివాసంలోనే పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పోలీసులతో ఆమె వాగ్వాదం చేసినా కూడా పోలీసులు అస్సలు వినలేదు. అసలు మీరు ఎందుకు వచ్చారు.. ఏమైంది.. మా గేట్లు ఎందుకు వేస్తున్నారు. విషయం చెప్పండి అని అనిత అడుగుతుంది. జగనన్నకి చెబుదాం ప్రోగ్రామ్ కు జగన్ వస్తున్నారా? లేదు కదా. నేను వెళ్తే తప్పేంటి.. కలెక్టర్ స్పందన కార్యక్రమానికి నేను వెళ్తే మీకు వచ్చిన సమస్య ఏంటి అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతుంది అనిత.
ప్రజా సమస్యల మీద స్పందించడానికి వెళ్తుండగా మీరు ఎలా అడ్డుకుంటారు. కలెక్టర్ ను కలవడానికి వెళ్తుంటే మీరు అడ్డుకోవడం ఏంటి? నేనే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా.. ప్లీజ్.. నేను ఎస్పీ గారికి ఫోన్ చేశాను.. అన్నా కూడా పోలీసులు వినరు. చివరకు గేటు దూకి వచ్చిన పోలీసులు ఆమెను గృహ నిర్బంధం చేశారు. నా చుట్టూ ఎందుకు ఇంత మంది పోలీసులు అంటూ ఆమె ప్రశ్నించారు. దీంతో తనకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆ నోటీసులను నేను తీసుకోను అంటూ ఆ నోటీసు అక్కడే పెడుతుంది. నా నియోజకవర్గంలో స్పందన ప్రోగ్రామ్ కు వెళ్తుండగా మీరు నన్ను ఎలా అడ్డుకుంటారు. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసమే కదా నేను వెళ్లేది.. కలెక్టర్ మీకు చెప్పారా? ఏంటి అసలు అంటూ పోలీసులపై తీవ్రస్థాయిలో మాట్లాడారు వంగలపూడి అనిత.
Vangalapudi Anitha : చిన్నపిల్లలు చనిపోయినా పట్టించుకోరా?
చిన్నపిల్లలు వాళ్లు. వాళ్లకు ఏం జరిగినా పట్టించుకోరా? అంటూ అనిత చెప్పడంతో మీరు వినకపోతే అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అంటారు పోలీసులు. అయినా కూడా అనిత వినదు. పోలీసులతో వాగ్వాదం చేస్తుంది. నేను స్పందనకే వెళ్తున్నా. స్పందన నుంచి నేను ఎక్కడా ధర్నాలు చేయను. ప్రజా సమస్యల మీద కలెక్టర్ కు ఫిర్యాదు చేయడానికి వెళ్తుంటే నన్ను అడ్డుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి నన్ను వెళ్లనివ్వండి.. చాలా సమస్యలు ఉన్నాయి. మీకు దండం పెడతా.. అంటూ అనిత వేడుకున్నారు.