Husbands Beard : ఇదేక్కడి విడ్డూరం.. భర్తకు గడ్డం లేదని మరిదితో లేచిపోయిన వదిన..!
ప్రధానాంశాలు:
Husbands Beard : ఇదేక్కడి విడ్డూరం.. భర్తకు గడ్డం లేదని మరిదితో లేచిపోయిన వదిన..!
Husbands Beard : బంధాలు మంట కలిసిపోతున్నాయి. రాను రాను అక్క, చెల్లి, వదిన, అమ్మ ఇలాంటి బంధాలకి వాల్యూ లేకుండా పోతుంది. కొన్ని ఉదంతాలు అనుబంధాల మీద కొత్త అనుమానాల్ని రేకెత్తించేలా చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. గడ్డంతో ఉన్న భర్తను.. క్లీన్ షేవ్ లో ఉండాలని కోరింది భార్య.. సదరు భర్త నో అంటే నో అని చెప్పటంతో సదరు భార్య తన భర్త తమ్ముడితో వెళ్లిపోయింది.

Husbands Beard : ఇదేక్కడి విడ్డూరం.. భర్తకు గడ్డం లేదని మరిదితో లేచిపోయిన వదిన..!
Husbands Beard గడ్డం భలే పని చేసిందిగా..
షకీర్ అనే వ్యక్తి మేరఠ్‌లోని లిసాది గేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉజ్వల్ గార్డెన్ ప్రాంతంలో తల్లి, సోదరుడితో కలిసి నివసిస్తున్నాడు. కాగా, ఏడు నెలల క్రితమే షకీర్‌కు, ఇంచౌలి గ్రామానికి చెందిన అర్షి అనే యువతితో పెళ్లి జరిగింది. పెళ్లయ్యాక తొలి రాత్రిలో తన భర్త ఎదుట అర్షి ఒక ప్రతిపాదన పెట్టింది. గడ్డం తీసేసి క్లీన్ షేవ్ చేసుకోమని భర్తకు సూచించింది. అయితే అందుకు షకీర్ నో చెప్పాడు.
ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం మొదటి నుంచే తాను గడ్డాన్ని పెంచుకుంటున్నాని భార్యకు తెలిపాడు. గడ్డం మాత్రం తీయలేనని, దాన్ని అలాగే ఉంచుతానని అర్షికి షకీర్ తేల్చి చెప్పాడు. గడ్డం విషయంలో దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. మౌలానా పనికి వెళ్తుండడంతో ఇంట్లో అత్తా, మరిది ఉండేవారు. మరిది క్లీన్‌గా షేవ్ చేసుకొని కనిపించడంతో ఇద్దరు మధ్య సానిహిత్యం పెరిగింది. దీంతో మరిదితో కలిసి భార్య పారిపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో భర్త ఫిర్యాదు చేశాడు. షకీర్ ఫిర్యాదుతో ఇద్దరు తప్పిపోయినట్లుగా పోలీసులు కేసు నమోదు చేస దర్యాప్తు చేస్తున్నారు.