MLA Sambasivarao : ఈ అహంకాంర వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది.. ఎమ్మెల్యే సాంబశివరావు సెన్సేషనల్ కామెంట్స్..!!
ప్రధానాంశాలు:
MLA Sambasivarao : ఈ అహంకాంర వల్లే బీఆర్ఎస్ ఓడిపోయింది.. ఎమ్మెల్యే సాంబశివరావు సెన్సేషనల్ కామెంట్స్..!!
MLA Sambasivarao : ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీలు తమ వాదనలను వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అసెంబ్లీలో మాట్లాడుతూ .. అసెంబ్లీని ఎక్కువ రోజులు నడపాలి. ఈ సమావేశాలకు ప్రతిపక్షం సహకరించాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా నిధులు రావాల్సి ఉంది. బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ ప్రభుత్వం చేయకుండా ముందుకు వెళ్లాలి. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూస్తామని బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు అనడం సరైనది కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు అతి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు అని తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఈ ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు. ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం సరైనది కాదు. స్వేచ్ఛ లేని జీవితాన్ని తెలంగాణ ప్రజలు అంగీకరించారు. స్వేచ్ఛ తెలంగాణ రావాలి.
పథకాల అమలులో విఫలమైన ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలి. పంజరం నుంచి బయటకు వచ్చినట్లు ప్రజలు భావిస్తున్నారు. 26 ప్రజాసంఘాలను గత ప్రభుత్వం నిషేధించింది. గత ప్రభుత్వం దళితులకు మూడు ఎకరాల భూమి, రెండు పడక గదుల ఇల్లు, దళిత బంధు, బీసీ బంధును విస్మరించింది. ప్రతి నెల ఒకటో తారీకున ఎందుకు జీతాలు ఇవ్వలేదు. విద్యార్థులకు ఉపకార వేతనాలు ఎందుకు ఇవ్వలేదు. బీఆర్ఎస్ తప్పులు చేయడం వల్ల అధికారం కోల్పోయింది అని సాంబశివరావు పేర్కొన్నారు. అధికారంలో ఏ పార్టీ ఉన్న ప్రజలకు మేలు చేయాలని కోరుకుంటాం. పాత ప్రభుత్వం చేసిన మంచి పనులు ఉంటాయి. వాటిని కొత్త ప్రభుత్వం కొనసాగించాలి.
వాళ్లు చేయలేని మంచి పనులను ప్రస్తుత గవర్నమెంటు చేయాలి. వారు చేసినటువంటి తప్పులను అర్థం చేసుకోవాలి. ఆ తప్పులను చేయకుండా ముందుకు వెళ్లాలి. ఏ ప్రభుత్వం సొంతంగా చేయదు ఉన్న వాటిని అభివృద్ధి చేసుకుంటూ వెళతారు. ఎంత మంచి ప్రభుత్వమైనా అనేక సంవత్సరాలు కొనసాగదు. ఓడిపోవడం అనేది ప్రజాస్వామ్య ప్రక్రియలో సాధారణం. ఈ ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో చూస్తామని అనడం సరైనది కాదు. కొంతమంది ఎమ్మెల్యేలు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారు. మహానుభావులకే ఓటమి తప్పలేదు. చంద్రబాబు ఓడిపోయారు. కేసీఆర్ ఓడిపోయారు. ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలని ఆయన పేర్కొన్నారు.