Mudragada Padmanabham : వైసీపీ లోకి ముద్రగడ పద్మనాభం.. వైయస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరేది అప్పుడే..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mudragada Padmanabham : వైసీపీ లోకి ముద్రగడ పద్మనాభం.. వైయస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరేది అప్పుడే..!

 Authored By tech | The Telugu News | Updated on :10 March 2024,5:20 pm

ప్రధానాంశాలు:

  •  Mudragada Padmanabham : వైసీపీ లోకి ముద్రగడ పద్మనాభం.. వైయస్ జగన్ సమక్షంలో పార్టీలోకి చేరేది అప్పుడే..!

Mudragada Padmanabham : ఏపీ సార్వత్రిక ఎన్నికలకు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతిపక్ష పార్టీలలో టెన్షన్ నెలకొంది. ఇక పార్టీలలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. లీడర్లు ఒక పార్టీ నుంచి మరొక పార్టీకి జంపు చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది లీడర్స్ ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి చేరారు. ఇక తాజాగా మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి చేరనున్నారు. ఈనెల 14న ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నారని తెలుస్తుంది. ఇక ముద్రగడ వెంట ఆయన కుమారుడు గిరిబాబు తో పాటు పలువురు కాపు సంఘం నేతలు కూడా వైసీపీలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. కిర్లంపూడి నుంచి భారీ సంఖ్యలో అనుచరులతో తాడేపల్లికి తరలి వెళ్లి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ముద్రగడ పార్టీలో చేరునున్నట్లు సమాచారం. ఇటీవల కిర్లంపూడి లోని ముద్రగడ నివాసంలో ఆయనతో వైసీపీ సీనియర్ నేతలు భేటీ అయ్యారు.

ఈ భేటీలో వైసీపీలో చేరతానని వారికి ముద్రగడ హామీ ఇచ్చారు. అంతేకాదు ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీకి తన సేవలు అందిస్తానని వైసీపీ నేతలకు ముద్రగడ చెప్పినట్లు సమాచారం. ఇక ముద్రగడ పద్మనాభం సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నేత. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేశారు. ఇక ముద్రగడ సేవలను హైకమాండ్ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో ఆసక్తికరంగా మారింది. త్వరలో జరగబోయే ఎన్నికల ప్రచారంలో ముద్రగడ సేవలను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించుకోవాలని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలోకి సిద్ధమయ్యాయి. ఈ క్రమంలో ఏపీలోని కాపు ఓటర్లు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపకుండా వైసీపీ ముద్రగడ పద్మనాభం సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గంలో ముద్రగడ పద్మనాభం కు ప్రచార బాధ్యతలు అప్పగించాలని వైసీపీ ఆలోచనలు ఉన్నట్లు సమాచారం.

మరోవైపు ముద్రగడ పద్మనాభం కుమారుడు గిరిబాబు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. పిఠాపురం నియోజకవర్గం నుంచి గిరిబాబు వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ముద్రగడకు నామినేటెడ్ పదవిని ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ముద్రగడ పార్టీలో చేరిన తర్వాత అన్ని అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముద్రగడ పద్మనాభం పత్తిపాడు నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి ఎంపీగా కూడా విజయం సాధించారు. ఎన్టీఆర్, చెన్నారెడ్డి హయాంలో మంత్రిగా పనిచేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముద్రగడ పిఠాపురం నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటినుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక తాజాగా ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు.

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది