Nagababu : మరోసారి మంత్రి రోజాపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ ..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Nagababu : మరోసారి మంత్రి రోజాపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ ..!

 Authored By aruna | The Telugu News | Updated on :7 January 2024,8:30 pm

ప్రధానాంశాలు:

  •  Nagababu : మరోసారి మంత్రి రోజాపై నాగబాబు సెన్సేషనల్ కామెంట్స్ ..!

Nagababu : జనసేన పార్టీ నేత నాగబాబు శనివారం తెనాలి నియోజకవర్గం జన సైనికులు వీర మహిళల సమావేశంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనసేన వచ్చేతరాల కోసం పెట్టిన పార్టీ అని అన్నారు. ఎన్నికలలో వెంటనే గెలవాలని పెట్టిన పార్టీ కాదని వ్యాఖ్యానించారు.గత పది సంవత్సరాల నుంచి జయపజయాలకు అతీతంగా పోరాటం చేస్తున్నామని అన్నారు. సాధారణంగా ఓడిపోతే జనాలు ఆ నాయకుడిని పట్టించుకోరు. కానీ ఓడిపోయే కొద్ది బలపడుతున్న రాజకీయ నేత పవన్ కళ్యాణ్ అని నాగబాబు అన్నారు. రాజకీయాలలో మాత్రమే కాదు సినీ ఇండస్ట్రీలో పరాజయాలు ఎదురైనా తర్వాత సినిమాకి పవన్ బిజినెస్ పెరగటం అతడి స్టామినాని నిరూపిస్తోంది. దానికి కారణం పవన్ మానవత్వానికి కనెక్ట్ అయిపోయారు అని అన్నారు.

ఇక జనసేన, టీడీపీ తో పొత్తు పెట్టుకోవడానికి కారణం కూడా వివరించారు. ఒకప్పుడు నేను కూడా చంద్రబాబును విమర్శించాను కానీ ఆయన ఎక్కడా కూడా ప్రజాస్వామ్యాన్ని అడ్డుకోలేదు. వై.యస్.జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు ఆయన ఎటువంటి ఆటంకం కలిగించలేదు. కానీ టీడీపీ చేసే కార్యక్రమాలను వైసీపీ నాయకులు అడ్డుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ చంద్రబాబును పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అందుకే ఇలాంటి నాయకుడిని ఎదుర్కోవాలంటే జనసేన, టీడీపీ తో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది అని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వలసలు ఎక్కువైపోయాయి. మరోసారి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే 50% జనాభా ఖాళీ అయిపోతుందని నాగబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలో యువతకి ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. పర్యావరణాన్ని నాశనం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నాగబాబు అన్నారు. టీడీపీ, జనసేన ప్రభుత్వ వచ్చాక సంక్షేమం అభివృద్ధి చేస్తామని వ్యాఖ్యానించారు. ఇకపోతే వై.యస్.జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని సిట్టింగ్ ఎమ్మెల్యేలను సైతం పక్కన పెడుతున్నారు. ఆస్థానంలో కొత్త ఇన్చార్జిలను నియమిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే వైసీపీ రెండు లిస్టులను విడుదల చేసింది. అందులో 38 మంది కొత్త ఇన్చార్జిలను ఏర్పాటు చేసింది. మరో కొద్ది రోజుల్లో మూడో లిస్ట్ కూడా రాబోతుంది. అందులో మంత్రి రోజా సీటు చిరిగే అవకాశం ఉందని అంటున్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది