Nagababu : నాగబాబు పదవిపై ఆసక్తికర చర్చ.. ఇంకెన్నాళ్లు వెయిటింగ్..!
ప్రధానాంశాలు:
Nagababu : నాగబాబు పదవిపై ఆసక్తికర చర్చ.. ఇంకెన్నాళ్లు వెయిటింగ్..!
Nagababu : జనసేన Janasena నేత నాగబాబు Nagababu భవిష్యత్తు, రాజకీయ ప్రయాణం ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. మంత్రివర్గంలోకి వెళ్తారా? లేక రాజ్యసభలో స్థానం పొందుతారా? అనే అంశంపై గత కొన్ని రోజులుగా ఆసక్తికర చర్చ నడుస్తుంది. త్వరలో ఏపీలో జరిగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయనకు బెర్త్ కన్ఫాం అయిందని చెబుతున్నారు. మార్చి 29న ఏపీలో ఐదు ఎమ్మెల్సీ MLC స్థానాలు ఖాళీ అవనుండగా,ఐదు ఖాళీల్లో జనసేన కోటాలో నాగబాబుకు అవకాశం పక్కా అనేది తెలుస్తోంది.

Nagababu : నాగబాబు పదవిపై ఆసక్తికర చర్చ.. ఇంకెన్నాళ్లు వెయిటింగ్..!
Nagababu సమయం లేదు మిత్రమా..
గతంలో రాజ్యసభ స్థానాన్ని త్యాగం చేసిన నాగబాబును రాష్ట్రం మంత్రివర్గంలోకి తీసుకుంటామని ముఖ్యమంత్రి Chandrababu Naidu చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. చట్టసభలో అడుగు పెట్టేందుకు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న నాగబాబు ఆశలు ఫలించినట్లే కనిపిస్తోందని టాక్ వినిపిస్తోంది.
జనసేనాని పవన్ Pawan Kalyan సైతం ముందుగా ఏదో ఒక సభకు నాగబాబును నామినేట్ చేసిన తర్వాతే మంత్రివర్గంలోకి చేర్చుకుంటామని చెప్పారు. అయితే ఇప్పుడు ఆ సమయం ఆసన్యమైనట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చట్టసభలో అడుగు పెట్టేందుకు సుదీర్ఘకాలంగా నిరీక్షిస్తున్న నాగబాబు ఆశలు ఫలించినట్లే అని కొందరు అంటున్నారు. మరో రెండు వారాల్లో ఎమ్మెల్సీ కాబోతున్న నాగబాబు.. మంత్రిగా బాధ్యతలు చేపట్టడమే ఆలస్యం అంటున్నారు.