Naga Babu : జనసేన పార్టీ కి తాళం వేయించే పని చేసిన నాగబాబు !
Naga Babu : మార్గదర్శి కేసులో A1గా రామోజీరావునీ సిఐడి విచారణ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కేసును జగన్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విచారణ క్రమంలో రామోజీరావు అస్వస్థతకీ గురికావడంతో… ఇంట్లో బెడ్ పైన పడుకోవడం జరిగింది. అయినా గాని మంచం మీద ఉన్న రామోజీరావుని సిఐడి విచారిస్తున్న ఉంది. దీంతో దాదాపు 80 సంవత్సరాలకు పైగా వయస్సున్న రామోజీరావుని మంచంపై ఆ రీతిగా విచారించటం తగదని చాలామంది రాజకీయ నేతలు సానుభూతిపరులు సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. ఈ రకంగానే జనసేన పార్టీ కీలక నేత నాగబాబు కూడా ట్విట్టర్ లో
“తెలుగు సినీ, మీడియా రంగంలో విప్లవాత్మకమైన అభివృద్ధిని తీసుకు వచ్చి, వ్యాపార రంగంలో వేలాది మందికి జీవనాధారం కల్పిస్తూ, కళారంగంలో “గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్”లో చోటు దక్కించుకొని ప్రపంచస్థాయిలో తెలుగు ఖ్యాతిని చాటి చెప్పిన “పద్మ విభూషణ్” శ్రీ రామోజీ రావ్ గారు లక్షలాది మందికి ఆదర్శం. ఆరు దశాబ్దాల ప్రస్థానంలో ఆయనకు ఎదురు కాని అవినీతి ఆరోపణలు వై.సీ.పీ. అధికారంలోకి వచ్చాక పుట్టుకు రావడం విచారకరం. ఏడు పదుల వయసుపైబడిన శ్రీ రామోజీ రావ్ గారిని, ఆయన కుటుంబాన్ని విచారణ పేరుతో వేధించడం శోచనీయం. శ్రీ రామోజీ రావ్ గారిపై సామాజిక మాధ్యమాల్లో కావాలని చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తున్నాం”.. అనే పోస్ట్ పెట్టడం జరిగింది. అయితే నాగబాబు పెట్టిన ఈ పోస్ట్ జనసేన పార్టీకి తాళం వేసే రీతిలో ఉందని మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.
మేటర్ లోకి వెళ్తే వచ్చే ఎన్నికలలో వైసీపీని ఢీ కొట్టాలంటే కచ్చితంగా తెలుగుదేశం పార్టీతో కలవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీల్చకుండా ముందుకు వెళ్లే ఆలోచనలో… పవన్ కళ్యాణ్ ఉన్నారు. కానీ మరోపక్క ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉంది జనసేన. ఈ క్రమంలో ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన చేపట్టిన సమయంలో బీజేపీ పెద్దలు… ఎట్టి పరిస్థితులలో తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండదని చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. ఈ పరిణామంతో..తెలుగుదేశం పార్టీ సైతం ఒంటరిగా బరిలోకి దిగటానికి రెడీ అవుతున్నట్లు కూడా ప్రచారం జరుగుతుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో టీడీపీ పుంజుకోవటంతో పవన్ కళ్యాణ్ ని పట్టించుకునే ఆలోచనలో టీడీపీ పెద్దలు లేనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఎలక్షన్ దగ్గర పడేకొద్దీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండే వారిని
“ఈనాడు” టార్గెట్ చేసే అవకాశం ఉందని ప్రచారం గట్టిగానే ఉంది. మామూలుగానే “ఈనాడు” అంటే తెలుగుదేశం పార్టీకి గేజెట్ పత్రిక అని అంటుంటారు. దీంతో ఎవరినైతే నాగబాబు ఇప్పుడు పోగుడుతున్నారో..రేపు ఆ రామోజీరావు… తన పత్రికలో టిడిపితో జనసేన పొత్తులేనప్పుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడం గ్యారెంటీ అని చెబుతున్నారు. అటువంటి సమయంలో నాగబాబు ఇప్పుడు రామోజీరావు పట్ల చేసిన సానుభూతి వ్యాఖ్యలు జనసేన పార్టీని ఇరకాటంలో పెట్టడం గ్యారెంటీ అని చెబుతున్నారు. దీంతో ఇప్పటికే పార్టీ రెండుసార్లు ఓడిపోయి ఎటువంటి స్థిరత్వం లేక సిద్ధాంతం లేక.. ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో ఓడిపోతే మొత్తానికి దుకాణం సర్దుకున్నే పరిస్థితి ఉందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.