Chandrababu Pension : ఇంటింటికి వెళ్లి డోర్ కొట్టి మరీ పించన్లు పంపిణీ చేస్తున్న చంద్రబాబు, లోకేష్
ప్రధానాంశాలు:
Chandrababu Pension : ఇంటింటికి వెళ్లి డోర్ కొట్టి మరీ పించన్లు పంపిణీ చేస్తున్న చంద్రబాబు, లోకేష్
Chandrababu Pension : ఏపీ కొత్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన మాటని నిలబెట్టుకుని.. ఆయనే ఒక వలంటీర్‌గా మారారు..! గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం పెనుమాక గ్రామంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు.. . రాజధాని అమరావతి పరిధిలోని పెనుమాకలో కొద్దిసేపటి కిందటే స్వయంగా అర్హులకు వాళ్ల ఇళ్ల వద్దే పింఛన్ మొత్తాన్ని అందజేశారు నారా లోకేష్. Nara Lokesh NTRఎన్టీఆర్ భరోసా ntr bharosa Pension సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా.. గుంటూరు జిల్లా పెనుమాకలోని ఎస్టీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు కూడా పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకు కాలనీలో స్వయంగా ఆయనే లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు.
Chandrababu Pension గ్రేట్ సీఎం..
బాణావత్ పాములు నాయక్ కుటుంబం చంద్రబాబు చేతుల మీదుగా పింఛన్ తీసుకుంది. పాములు నాయక్‌కు వృద్ధాప్య పింఛన్, ఆయన కుమార్తె ఇస్లావత్ శివకుమారికి వితంతు పింఛన్, ఆయన భార్యకు రాజధానిలో భూమిలేనివారికి అందజేస్తున్న పింఛన్‌ను స్వయంగా చంద్రబాబు అందజేశారు. దేశంలోనే తొలిసారి ఓ ముఖ్యమంత్రి స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందజేశారు.. ఇది ఓ రికార్డ్ అని చెబుతున్నారు. పింఛన్ల పంపిణీ సందర్భంగా చంద్రబాబు వారితో ఆప్యాయంగా మాట్లాడారు. యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారని ఆరా తీశారు. వారి వివరాలను తెలుసుకున్నారు. ఇంకా బాగా చదవాలంటూ ప్రోత్సహించారు. తల్లిదండ్రులను కష్టపెట్టకూడదని హితవు పలికారు చంద్రబాబు.
కూలిపనులు చేసుకుంటూ చదివిస్తోన్నారని, క్లాస్‌లో అందరికంటే మంచి మార్కులు తెచ్చుకోవాలని అన్నారు. ఆర్థికంగా ఆదుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటానని చంద్రబాబు ఆ లబ్దిదారుడి కుటుంబానికి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ, సహకారాలు అందిస్తామని, ఇంకా ఎక్కువ కష్టపడి అదనపు ఆదాయాన్ని పొందాలంటూ లబ్దిదారుడికి సూచించారు. మీకు మంచి ఎమ్మెల్యే ఉన్నాడు.. అంటూ నారా లోకేష్‌ను ప్రశంసించారు. నారా లోకేష్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న మంగళగిరి అసెంబ్లీ పరిధిలోకి పెనుమాక వస్తుందనే విషయం తెలిసిందే. ఇంటి వద్దకే పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొత్తం ఆయన పర్యవేక్షణలోనే సాగింది. ఇది గ్రాండ్ సక్సెస్ కావడం చంద్రబాబులో ఉత్సాహాన్ని నింపినట్టయింది.