Nirmala Sitharaman : జమిలి ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి.. 2034 తర్వాతే అంటూ క్లారిటీ..!
ప్రధానాంశాలు:
Nirmala Sitharaman : జమిలి ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి.. 2034 తర్వాతే అంటూ క్లారిటీ
Nirmala Sitharaman : గత కొద్ది రోజులుగా జమిలి ఎన్నికలకి సంబంధించి అనేక వార్తలు వస్తున్నాయి. దేశంలో వన్ నేషన్-వన్ ఎలక్షన్ పేరుతో ఒకేసారి అసెంబ్లీ, పార్లమెంటుకు ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర తలపిస్తుంది. జమిలి ఎన్నికలపై పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చనడుస్తోంది. ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రకటిస్తూ ఉన్నాయి.

Nirmala Sitharaman : జమిలి ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి.. 2034 తర్వాతే అంటూ క్లారిటీ
Nirmala Sitharaman : ఇది క్లారిటీ..
ఏపీలో అయితే.. 11 స్థానాలకు పరిమితమైన వైసీపీ అదినేత జగన్.. తన పార్టీ నాయకులతో ఎప్పుడు భేటీ అయినా.. ఇంకే ముంది.. ఎన్నికలకు ఆట్టే సమయం లేదని.. మనదే గెలుపు పక్కా అని చెబుతున్నారు. దీంతో నాయకులు కొంత ఊరట చెందుతున్నారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల నాటికి జమిలి ఎన్నికలు నిర్వహించే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, జమిలి ఎన్నికలు నిర్వహిస్తే ఈ మొత్తం ఆదా అవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 2034 తర్వాతే జమిలి ఎన్నికలు ఉంటాయని, ప్రస్తుతం వాటికి పునాది మాత్రమే పడిందని నిర్మలా సీతారామన్ అన్నారు. జమిలి ఎన్నికలపై ఎన్నోసార్లు చర్చలు జరిగాయని గుర్తు చేశారు. జమిలిని గుడ్డిగా వ్యతిరేకించేవారు, దాని ప్రయోజనాలు తెలుసుకొని మద్దతిస్తే దేశానికి మేలు జరుగుతుందని నిర్మలా అన్నారు.