Pawan kalyan : నా పేరు చెప్పి రూల్స్ బ్రేక్ చేస్తే అంద‌రు న‌న్ను కొడ‌తారంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan kalyan : నా పేరు చెప్పి రూల్స్ బ్రేక్ చేస్తే అంద‌రు న‌న్ను కొడ‌తారంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్

 Authored By ramu | The Telugu News | Updated on :4 July 2024,1:00 pm

Pawan kalyan : పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తూ రాజకీయాలలో చురుకుగా కదులుతున్నారు. ప్రజాసమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. వాటిని వెంటనే పరిష్కారం దిశగా ముందుకు సాగుతున్నారు. అయితే తనని బంపర్ మెజారిటీతో గెలిపించిన పిఠాపురం ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేసేందుకు పవన్ కళ్యాణ్ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంలో.. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న OG మూవీ అప్డేట్‌తో పాటు తన తదుపరి చిత్రాల షూటింగ్‌పై కూడా క్లారిటీ ఇచ్చేశారు.

Pawan kalyan ఇక సినిమాలు చేయ‌న‌ట్టే..

ప‌వ‌న్ మాట్లాడుతుండగా.. ఆయన అభిమానులు OG.. OG అంటూ అరిచారు. దాంతో పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు.OGనా.. నాకు సినిమాలు చేసే టైం ఉందంటారా?? నేను మాట ఇచ్చాను కాబట్టి.. మీతో నేను తిట్టించుకోకూడదు కదా.. నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వెళ్లి OG సినిమా చేస్తున్నావా? అని తిట్టకూడదు కదా.. అందుకే మూడు నెలలు పాటు.. రోడ్లు, ప్రజా పాలనపైనే దృష్టిపెట్టాను. మా నిర్మాతలకు కూడా చెప్పాను. నన్ను క్షమించాలి. మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసుకుంటాను. నాకు కుదిరినప్పుడు రెండు రోజులో.. మూడు రోజులో షూటింగ్ చేస్తాను. మీరు OG చూద్దురు గాని.. బాగుంటుంది. ముందు నన్ను పనిచేయనీయండి. ఎమ్మెల్యేగా పనిచేస్తావని నిన్ను ఎన్నుకంటే OG ఏంటీ క్యాజీ అంటే నేనేం చెప్పాలి. అందుకే కుదిరినప్పుడు రెండు మూడు రోజులు షూటింగ్ చేస్తా అని ప‌వ‌న్ అన్నారు.

Pawan kalyan నా పేరు చెప్పి రూల్స్ బ్రేక్ చేస్తే అంద‌రు న‌న్ను కొడ‌తారంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్

Pawan kalyan : నా పేరు చెప్పి రూల్స్ బ్రేక్ చేస్తే అంద‌రు న‌న్ను కొడ‌తారంటూ ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్

ఇక మనం గెలిచాం కదా అని చెప్పి.. గత ప్రభుత్వ నాయకుల్ని కానీ.. వారి కార్యకర్తల్ని కానీ.. హింసించవద్దు. వారిపై దాడులుచేయొద్దు. కనీసం వారిని సోషల్ మీడియాలో కూడా పోస్ట్‌లు పెట్టొద్దు.. మనం కక్షసాధింపు చర్యలకు పాల్పడవద్దు. అది మనకి మంచిది కాదు.. అలాంటి పనులు మనం చేయొద్దు. పిఠాపురం తాలూకా అని చెప్పి నాకు చెడ్డపేరు తీసుకుని రావొద్దు. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్‌లు ఏదంటే.. పిఠాపురం తాలూకా అంటే నన్ను తిడతారు. కొడతారు. మీరు రాంగ్‌వేలో వెళ్తూ.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే ఎట్టా.. ముందు మనం నిబంధనల్ని పాటించాలి. అందరూ చట్టాలను గౌరవించాలి. ముందు మీరు రూల్స్ పాటించండి. మీకు కావాలంటే నాకు ఇక్కడ రెండెకరాల పొలం ఉంది. అక్కడికి వచ్చి.. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలుకా అని బైక్‌లు వేసుకుని వచ్చి తిరగండి అని ప‌వ‌న్ తెలియ‌జేశారు.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది