Pawan Kalyan : టీడీపీ కంచుకోటల్లో అభ్యర్ధులని ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్ – ఇది చాలా పెద్ద ప్లాన్ గురూ !
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో దూకుడుగా వెళుతున్నారు. జనసేన వారాహి యాత్రలో ప్రజా సమస్యల విషయంలో వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ సీఎం వైఎస్ జగన్ పై పవన్ చేస్తున్న వ్యాఖ్యలు… కీలకంగా మారాయి. ముఖ్యంగా వాలంటీర్లు వ్యవస్థ పై పవన్ చేసిన వ్యాఖ్యలు ఒక్కసారిగా ఏపీ రాజకీయాలను వేడెక్కించాయి. ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కంటే దూకుడుగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. పవన్ చేస్తున్న వ్యాఖ్యలతో… ఏపీలో రాజకీయ ముఖచిత్రం జనసేన వర్సెస్ వైసీపీ అన్నట్టు పరిస్థితి మారింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో పవన్ సామాజిక వర్గం కాపు వర్గానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో.. అక్కడ జరుగుతున్న వారాహి యాత్రకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు.
ఇదే సమయంలో గోదావరి జిల్లాలలో ఒక్క స్థానం కూడా వైసిపి గెలవనివ్వకుండా చేయడమే తన టార్గెట్ అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. మామూలుగా గోదావరి జిల్లాలలో ఇంకా కోస్తా ఆంధ్రాలో చాలావరకు తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. ఈ క్రమంలో టిడిపికి కంచుకోటలుగా కొన్ని నియోజకవర్గాల సైతం ఉన్నాయి. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా ఉండే చోట్ల పవన్ కళ్యాణ్ తన పార్టీ అభ్యర్థులను వచ్చే ఎన్నికలకు ఎంపిక చేసినట్లు సమాచారం. అది కూడా గోదావరి జిల్లాలలోనే అట. విషయంలోకి వెళ్తే పిఠాపురం, రాజానగరం, కొవ్వూరు నియోజకవర్గలు…టీడీపీ పార్టీకి బలమైన కంచుకోటలుగా ఉన్నాయి.
పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు ఈ మూడు నియోజకవర్గాలలో ఆగమేఘాల మీద పవన్ ఇన్చార్జిలను నియమించారు. తంగెల ఉదయ్ శ్రీనివాస్, బత్తుల రామకృష్ణ, టీవీ రామారావులను ఇన్చార్జిలుగా నియమించడం జరిగింది. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీకి గోదావరి జిల్లాలలో ఎక్కడ కూడా.. ఉనికి లేకుండా పవన్ పెద్ద వ్యూహం పన్నినట్లు వార్తలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గోదావరి జిల్లాలలో అత్యధికంగా గెలిచే పార్టీ యే అధికారంలోకి వస్తది. 2014లో జనసేన పొత్తుతో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాలు గెలిచింది. 2019లో వైసిపి.. అత్యధిక స్థానాలు తెలిసింది.
అయితే తాజాగా తెలుగుదేశం పార్టీతో పొత్తులు కుదిరే ప్రసక్తి కనిపించకపోవడంతో పాటు సీట్ల సర్దుబాటులో ఒకే తాటిపైకి పరిస్థితులు రాని నేపథ్యంలో.. పవన్ గోదావరి జిల్లాలను ఆధారం చేసుకుని కింగ్ మేకర్ అవటానికి ట్రై చేస్తున్నట్లు టాక్. కర్ణాటక రాష్ట్రంలో కుమారస్వామి మాదిరిగా ఏపీలో పవన్ గోదావరి జిల్లాలలో సత్తా చాటి ముఖ్యమంత్రి స్థానాన్ని డిసైడ్ చేసే రీతిలో.. చాలా పెద్ద ప్లాన్ వేసినట్లు సమాచారం.