Pawan Kalyan : సోషల్ మీడియాలో యుద్ధం చేయడమేనా.. బయటికొచ్చి నేరుగా ఢీకొట్టేదేమైనా ఉందా పవన్?
Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ట్విట్టర్ యుద్ధం చేస్తున్నారు. అవును.. ఆయన ఏపీ సర్కారుపై ట్విట్టర్ వేదికగా యుద్ధం చేస్తున్నారు. నిజానికి పవన్ కళ్యాణ్ ఎక్కువగా ట్విట్టర్ లోనే స్పందిస్తూ ఉంటారు. వైసీపీ పార్టీపై కానీ.. ఏపీ ప్రభుత్వంపై కానీ విమర్శలు చేయాలంటే ఆయన చేసేది ముందు ట్వీటే. నేరుగా ఆయన తిట్టడం చాలా తక్కువ. ఎప్పుడైనా జనసేన పార్టీ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ లో వైసీపీపై విరుచుకుపడతారు తప్పితే ఆయనది నేరుగా ప్రచ్ఛన్న యుద్ధం అంటూ ఏదీ ఉండదు.
ఇక.. గత నాలుగురోజుల నుంచి వరుస ట్వీట్లతో రెచ్చిపోతున్నారు పవన్ కళ్యాణ్. పాపం పసివాడు, దొంగలకు దొంగ అంటూ సినిమా పేర్లను ఉపయోగించుకొని వీడియోలు షేర్ చేసి మరీ రచ్చ చేశారు. ఆ తర్వాత అన్నమయ్య డ్యాంపై కూడా ప్రశ్నల వర్షం కురిపించారు. అసలు ఈ ట్వీట్ల యుద్ధం ఏంటి పవన్. ఏదైనా ఉంటే నేరుగా ప్రభుత్వాన్ని కడిగిపారేయొచ్చు కదా అని నెటిజన్లు ఊసురు మంటున్నారు.ఎన్నికలకు ఇంకా సంవత్సరం సమయమే ఉంది. తక్కువ సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్లు, గ్విట్టర్లు పట్టుకొని కూర్చొంటే ఎలా? ఈ సోషల్ మీడియా యుద్ధాలు చేస్తే, సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఎలా పవన్.
Pawan Kalyan : ప్రజల దగ్గరికి ఇంకెప్పుడు వెళ్తావు పవన్
అది ఎలా వర్కవుట్ అవుతుంది.. అంటూ ఏకిపారేస్తున్నారు. ప్రజల్లోకి ఇంకెప్పుడు వెళ్తావు పవన్ అంటున్నారు. ఈ డిజిటల్ ప్రచారాన్ని కాస్త పక్కన పెట్టి ముందు ప్రజల దగ్గరికి వెళ్లు పవన్ అంటూ పవన్ కు సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ప్రజల పక్షాన ఎక్కడి నుంచి యుద్ధం చేస్తే ఏంటి.. సోషల్ మీడియా కూడా ఇప్పుడు బలమైన ఆయుధమే కదా అంటూ జనసైనికులు అంటున్నారు. ఏమో చూద్దాం మరి పవన్ ట్వీట్ల యుద్ధం ఎంతమేరకు వర్కవుట్ అవుతుందో?