Pawan kalyan : తణుకు వేదికగా వై.యస్ జగన్ కు పవన్ సవాల్… దమ్ముంటే రా…!
ప్రధానాంశాలు:
Pawan kalyan : తణుకు వేదికగా వై.యస్ జగన్ కు పవన్ సవాల్... దమ్ముంటే రా...!
Pawan kalyan : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన ,టీడీపీ ,బీజేపీ కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పాల్గొంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ పబ్లిక్ మీటింగ్స్ ను ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుచోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఇటీవల తణుకు వేదికగా ప్రజగలం భారీ బహిరంగ సభనుభను నిర్వహించడం జరిగింది. ఇక ఈ భారీ బహిరంగ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Pawan kalyan : యువతకు ఉపాధి అవకాశాలు..
దశాబ్ద కాలంగా పార్టీ పెట్టి నేను పని చేస్తుంది ఆంధ్ర రాష్ట్ర యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని… అలాగే ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారు 2047 కి భారత దేశ భవిష్యత్తు ఈ విధంగా ఉండాలని కోరుకుంటున్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు గారు బలమైన నాయకులు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తి , తెలంగాణ రాష్ట్రంలో సైదరాబాద్ వంటి సిటీకి రూపకల్పన చేసిన వ్యక్తి, దానికోసం శ్రమించిన వ్యక్తి. అయితే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నుండి మనకు అన్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ క్రమంలోనే మనలో మనం తన్నుకోకుండా కలిసికట్టుగా ఉండాలని సూచించారు. ఇప్పటినుండి పార్టీలన్నీ కూడా కలిసి ఉండాలని లేకపోతే దుర్మార్గపు పార్టీలు రాజ్యం ఏలుతాయి అంటూ పవన్ కళ్యాణ్ తెలియజేశారు.
ఇక నేటి ప్రభుత్వం గురించి ఒకసారి ఆలోచించండి. పోలవరం ప్రాజెక్టు గురించి అడిగితే ఆ పోలవరం ప్రాజెక్టు ఇరిగేషన్ మంత్రి “ఓలమ్మి తిక్క రేగిందా” అంటూ డాన్స్ చేస్తున్నాడు. పునరావాసం కల్పించారా అని అడిగితే మరో పాటకు డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాడని పవన్ కళ్యాణ్ ఏద్దేవ చేశారు. వైసీపీ పార్టీలో కేవలం దాడులు చేసే వాళ్ళు దుర్మార్గులు , డాన్సులు చేసే వాళ్ళు మాత్రమే మంత్రులుగా ఉన్నారని ప్రజల సంక్షేమం గురించి ఆలోచించేవారు ఎవరూ లేరని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తెలిపారు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మనమంతా కలిసి దుర్మార్గుడైన జగన్ ను గద్దే దించి ప్రజా పాలనను అధికారంలోకి తీసుకు వద్దామంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు.