Pawan kalyan : టీడీపీ తో అందుకే పొత్తు పెట్టుకున్నా ‘ – జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Pawan kalyan : టీడీపీ తో అందుకే పొత్తు పెట్టుకున్నా ‘ – జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..!

Pawan kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ సీపీ పార్టీని ఓడించి తాము అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ పార్టీలు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు తెలిసిందే ఇటివల కాకినాడ హార్బర్ లో బోట్లు కాలిపోయాయి. ఈ విషయంపై […]

 Authored By aruna | The Telugu News | Updated on :1 December 2023,11:00 am

ప్రధానాంశాలు:

  •  Pawan kalyan : టీడీపీ తో అందుకే పొత్తు పెట్టుకున్నా ' -

  •  జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్..!

Pawan kalyan : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో వైయస్సార్ సీపీ పార్టీని ఓడించి తాము అధికారంలోకి రావాలని పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే జనసేన, టీడీపీ పార్టీలు ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు తెలిసిందే ఇటివల కాకినాడ హార్బర్ లో బోట్లు కాలిపోయాయి. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ .. కండ బలం, గుండె బలం ఎంత ఉందో ఒక మత్స్యకారుడిని చూసి నేర్చుకోవచ్చు. ఒక మత్స్యకారుడు వేట కోసం వందల కిలోమీటర్ల దూరం వెళ్లి తిరిగి ఇంటిని గడపాలి అంటే ఎంత కష్టమైనా పని. పాతిక లక్షలు ఖర్చు పెట్టి బోట్లు కొంటె చివరికి అవి కాలిపోయాయి.

హార్బర్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా చీకటి గ్యాంగ్ నడుస్తుంది. హార్బర్లో కొంతమంది గ్యాంగ్స్ గా ఏర్పడి మత్స్యకారులను బెదిరిస్తున్నారు. ఆడవారి మీద దోపిడీలు చేస్తున్నారు. గతంలో ఈ పరిస్థితి లేదు. గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఈ పరిస్థితి ఎక్కువైపోయింది. ఆంధ్ర రాష్ట్రమంతా ఇదే పరిస్థితి. రౌడీ మూకలు రాజ్యాన్ని ఏలేస్తున్నారు. నాలుగు నెలల తరువాత హార్బర్ మంచి స్థాయికి తీసుకొచ్చి హామీ జనసేన తీసుకుంటుంది అని అన్నారు. ఇక జనసేన టిడిపి తో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో కూడా చెప్పారు. వైసీపీతో ఛాన్స్ తీసుకోవడం లేదని, ఎంత బలం ఉన్న కానీ ఒకసారి 500 ఓట్లతో ఓడిపోయాం, 5000 ఓట్లతో ఓడిపోయాం అనె పరిస్థితి రాకూడదని. మెజారిటీతో గెలవాలని,

మళ్లీ వైసీపీ వస్తే చీకటి మూకలు ఉంటాయని, వైసీపీ నాయకులు దండుపాలెం గ్యాంగ్ లాగా తయారయ్యారు అని అన్నారు. కచ్చితంగా ఇక్కడ మెరైన్ పోలీస్ ఏర్పాటు చేయాలని, ప్రతి మహిళ రక్షణ బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని, 2 లక్షల 40 కోట్ల మత్స్య సంపదను మన రాష్ట్రం ఎగుమతి చేస్తుందని, దీని ఆదాయం దాదాపుగా 16 వేల కోట్లు ఉంటుందని, మీరు రాష్ట్రానికి ఇంత ఆదాయం ఇయిస్తున్నారు కానీ ప్రభుత్వ మీకేం చేస్తుంది, ఓట్లు పోతాయని భయంతో హార్బర్లో జరిగిన ప్రమాదానికి పారితోషికం ఇచ్చారు రాష్ట్రంలో మత్స్య సంపద ఇంత ఉన్న మత్స్యకారులు పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. రాష్ట్రానికి చాలా ఆదాయం ఇస్తున్న మీరు ఎందుకు అడుక్కోవాలి. మత్స్య కారులకు అండగా, వారి జీవితాలకు వెలుగునిచ్చే బాధ్యత జనసేన పార్టీదే అని ఆయన అన్నారు.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది