జనసేన ఉరుము ఉరిమి తెలంగాణ బీజేపీ మీద పడిందా? ప్రతీకారం తీర్చుకుంటున్న పవన్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

జనసేన ఉరుము ఉరిమి తెలంగాణ బీజేపీ మీద పడిందా? ప్రతీకారం తీర్చుకుంటున్న పవన్

 Authored By brahma | The Telugu News | Updated on :15 March 2021,2:35 pm

pawan kalyan : ఉరుము ఉరిమి మంగళం మీద పడినట్లు అనే సామెత గురించి అందరు వినే వుంటారు. దానిని మరోసారి గుర్తుచేస్తున్నాయి పవన్ కళ్యాణ్ మాటలు. నిజానికి రెండు ప్రత్యర్థి పార్టీలైన సరే ఒక వైపు ఎన్నికలు జరుగుతున్నా సమయంలో మరోవైపు ప్రెస్ మీట్ పెట్టి ఒక పార్టీకి నష్టం కలిగించే వ్యాఖ్యలు చేయవు. అలాంటిది మిత్ర పార్టీగా భావించే బీజేపీ విషయంలో జనసేన అధినేత వ్యవహరించిన తీరు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

pawan kalyan

స్వరం మార్చిన జనసేనాని

తెలంగాణలో హోరాహోరీగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్, ఒక పక్క పోలింగ్ జరుగుతున్న సమయంలో ప్రెస్ మీట్ పెట్టి బీజేపీ కి వ్యతిరేకంగా మాట్లాడటమే కాకుండా, తెరాస నిలబెట్టిన అభ్యర్థికి ఓటు వేయాలని పిలుపునిచ్చి సంచలనాలకు కేంద్ర బిందువు అయ్యాడు. అయితే ఇన్నాళ్లు మౌనంగా ఉంటున్న పవన్ కళ్యాణ్ కీలకమైన సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఏమిటో చాలా మందికి అర్ధం కావటం లేదు.

నిజానికి తెలంగాణ బీజేపీ నేతలు గ్రేటర్ ఎన్నికల సమయంలో జనసేన పార్టీని తక్కువ చేసి మాట్లాడారు అంటూ జనసైనికులు బాధపడ్డారు. అప్పుడు మౌనంగా ఉన్న పవన్, నేడు తెలంగాణ బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడటం వెనుక కేవలం గ్రేటర్ ఎన్నికల సమయంలో జరిగిన అవమానం ఒక్కటే కాదని ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన పోటీచేయాలని ఎప్పటినుండో భావిస్తుంది. అందుకోసమే గ్రేటర్ లో పోటీనుండి తప్పుకు తప్పుకొని బీజేపీకి మద్దతు ఇచ్చింది.

Pawan kalyan

Pawan Kalyan

జనసేనాని హార్డ్ అయ్యాడా..?

తీరా ఇప్పుడు తిరుపతి ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి బీజేపీ హ్యాండ్ ఇచ్చి, తామే పోటీచేస్తామని చెప్పటంతో కాకుండా, తెలివిగా జనసేనను పక్కకు తప్పించింది. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ బాగా హార్డ్ అయినట్లు తెలుస్తుంది, కాకపోతే పొత్తు ధర్మం ప్రకారం బీజేపీని డైరెక్ట్ గా ఏమి అనలేక, తిరుపతి విషయంలో సైలెంట్ అయ్యాడు. అయితే మరోపక్క జనసైనికులు మాత్రం ఈ విషయంలో తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. ఇలాగైతే పార్టీని నడిపించటం కష్టమని, బీజేపీతో ఉంటే ఎలాంటి లాభం లేకపోగా, దాని వలన మరింత నష్టం కలుగుతుందని పవన్ కళ్యాణ్ ముందే కుండ బద్దలు కొట్టినట్లు తెలుస్తుంది.

దీనితో ఆలోచనలో పడిన పవన్ కళ్యాణ్ ఎలాగైనా తన వ్యతిరేక స్వరాన్ని వినిపించాలని భావించి, అందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో బీజేపీకి వ్యతిరేకంగా ఆరోపణలు చేశాడు. దీనితో ఖచ్చితంగా కేంద్ర అధిష్టానం నుండి పిలుపు రావటం ఖాయమని పవన్ కళ్యాణ్ కు కూడా తెలుసు, అదే జరిగితే తాడో పేడో తేల్చుకోవడానికి కూడా ఒక రకంగా సిద్దమయ్యాడు అని జనసేన వర్గాలు చెపుతున్నాయి. ఇక్కడ మరోకోణం దాగిఉంది. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తే దానిని గౌరవించ కూడా జనసేన విషయంలో చవకబారు ఆరోపణలు చేశారు బీజేపీ నేతలు, ఇప్పుడు తిరుపతిలో మద్దతు ఇవ్వటంతో మరోసారి బీజేపీ అలాంటి ఆరోపణలు చేస్తే జనసేన కు ప్రజల్లో కొద్దో గొప్పో ఉన్న ఇమేజ్ పోవటం ఖాయం. అందుకే బీజేపీకి ఒక హెచ్చరిక లాంటిది జారీ చేసినట్లు అవుతుందని అలోచించి జనసేనాని ఇలాంటి వ్యాఖ్యలు చేసాడని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు

brahma

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది