Pendurthi : ఒకరికి ఒకసారే ఛాన్స్ ఇస్తున్న పెందుర్తి.. ఈ సారి చరిత్ర మారుతుందా…?
ప్రధానాంశాలు:
Pendurthi : ఒకరికి ఒకసారే ఛాన్స్ ఇస్తున్న పెందుర్తి.. ఈ సారి చరిత్ర మారుతుందా...?
Pendurthi : ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గానికి ఒక్కో చరిత్ర ఉంటుంది. అన్ని నియోజకవర్గాలకు ఒకే విధమైన విధానాలు మాత్రం ఉండవు. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలు ప్రతి సారి ఒకరికే పట్టం కడుతూ ఉంటాయి. కానీ కొన్ని నియోజకవర్గాలు మాత్రం ఒక్కో ఎన్నికల్లో ఒకరికి ఒకసారి మాత్రమే ఛాన్స్ ఇస్తుంటాయి. ఇలాంటి నియోజకవర్గమే పెందుర్తి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుంచి ఏ ఒక్కరికి కూడా రెండు సార్లు ఛాన్స్ ఇవ్వరు. ఈ నియోజకవర్గం 1978 లో ఏర్పాటు అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం ప్రతిసారి చైతన్యాన్నిచూపిస్తూనే ఉంది.
Pendurthi : ప్రతిసారి జెండా మార్పు..
ఎందుకంటే ఇక్కడ ఒకసారి గెలిచిన వారు రెండోసారి గెలవరు. ప్రతి ఎన్నికల్లో కొత్త అభ్యర్థికే పట్టం కడుతూ ఉంటారు ఇక్కడి ప్రజలు. ఒకసారి ఒక పార్టీ గెలిస్తే మరోసారి మరో పార్టీ జెండా ఎగురుతుంది. పెందుర్తిలో అర్బన్, రూరల్ ఏరియాలు కలిసి ఉంటాయి. అందుకే ఇక్కడ రెండు రకాల ప్రజలు ఉంటారని చెప్పుకోవాలి. భిన్నమైన వాతవారణం, భిన్నమైన సంప్రదాయాలు కలిగిన మనుషులు పెందుర్తిలో ఉంటారు. అందుకే ఇక్కడి ప్రజలు ఎన్నికల విషయంలో ఒక్కతాటిమీద ఉండరు. ఇక్కడ భారీ మెజార్టీ కూడా ఎవరికీ రాదనే చెప్పుకోవాలేమో. ప్రతి ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతోనే అభ్యర్థులు గెలుస్తారంటే ఇక్కడ పోటీ తత్వం ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు ఈ నియోజకవర్గంలో 11 ఎన్నికలు జరగ్గా.. ఒకసారి గెలిచిన వారికి మరోసారి ఛాన్స్ ఇవ్వలేదు. ఈ సారి మాత్రం ఇక్కడి నుంచి వైసీపీ తరఫున అన్నంరెడ్డి అదీప్ రాజ్, జనసేన నుంచి పంచకర్ల రమేశ్ పోటీ చేస్తున్నారు.

Pendurthi : ఒకరికి ఒకసారే ఛాన్స్ ఇస్తున్న పెందుర్తి.. ఈ సారి చరిత్ర మారుతుందా…?
ఇందులో అదీప్ రాజ్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మరోసారి టికెట్ సాధించారు. ఇక పంచకర్ల కూడా గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి ఆయన జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా సరే కొత్త చరిత్ర సృష్టిస్తారు. ఎందుకంటే వీరిద్దరిలో ఎవరు గెలిచినా పెందుర్తి నుంచి రెండుసార్లు గెలిచిన వ్యక్తిగా చరిత్ర సృష్టిస్తారనే చెప్పుకోవాలి. చూడాలి మరి ఈ సారి ఎవరు చరిత్ర మారుస్తారు అనేది.