Husband Wife : భర్త భార్య.. ఓ దొంగాట.. ఆశ్చర్యంలో ప్రజలు..!
ప్రధానాంశాలు:
దొంగతనాలకి పాల్పడి కటకటాలైన జంట.. ఆశ్చర్యంలో ప్రజలు
Husband Wife : దంపతులు అంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ప్రేమ, బాధ్యత కలగలిపిన బంధంగా ఉండాలి. కానీ విశాఖపట్నం జిల్లా పెందుర్తి ప్రాంతంలో ఓ జంట మాత్రం ఇందుకు భిన్నంగా, దొంగతనానికి పాల్పడి చివరకు జైలుపాలయ్యారు. రోమియో-జూలియట్‌లా కనిపించే గణేష్, మాణిక్యేశ్వరి అనే భార్యాభర్తలు, బంగారం షాపుల్లో చోరీలకు పాల్పడిన కేసులో దోషులుగా తేలిపోయారు.

Husband Wife : భర్త భార్య.. ఓ దొంగాట.. ఆశ్చర్యంలో ప్రజలు..!
Husband Wife : డేంజరస్ జంట..
2025 ఫిబ్రవరిలో పెందుర్తిలోని రెండు బంగారు దుకాణాల్లో ఉంగరాలు చోరీకి గురయ్యాయి. ఫిర్యాదులపై స్పందించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ ఆధారంగా దర్యాప్తు సాగించిన పోలీసులు, కాకినాడకు చెందిన ఈ దంపతుల హస్తం ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకొని, విచారణ అనంతరం రిమాండ్‌కు తరలించారు.కేసు విచారణ పూర్తయిన అనంతరం, విశాఖపట్నం ఏడవ అదనపు మెట్రోపాలిటన్ కోర్టు తీర్పు వెలువరించింది. దంపతులకు ఒక్కొక్కరికి ఏడాది జైలు శిక్ష, రూ.200 జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇక మరోవైపు, విశాఖ నగరంలోని జ్ఞానాపురం రైల్వే స్టేషన్ సమీపంలోని ఓ పాడుబడిన భవనం పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గంజాయి మొక్కలున్నాయని అనుమానం కలిగించే ఘటన చోటుచేసుకుంది. స్థానికులు గుర్తించిన ఈ మొక్కల గురించి వెంటనే కంచరపాలెం పోలీసులుకి సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మొత్తం 15 మొక్కలు అక్కడ పెరిగి ఉన్నట్లు గుర్తించారు. అవి గంజాయి మొక్కలుగా అనిపించినా, వాసన మాత్రం భిన్నంగా ఉందని పోలీసులు పేర్కొన్నారు. దీనిపై స్పష్టత కోసం మొక్కలను ల్యాబ్‌కు పంపారు. దానిపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.