Ys Sharmila : తండ్రి నుండి ష‌ర్మిళ‌కి వ‌చ్చిన ఆస్తులెన్ని.. జ‌గ‌న్ అద‌నంగా ఎంత ఇచ్చారు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ys Sharmila : తండ్రి నుండి ష‌ర్మిళ‌కి వ‌చ్చిన ఆస్తులెన్ని.. జ‌గ‌న్ అద‌నంగా ఎంత ఇచ్చారు..!

 Authored By ramu | The Telugu News | Updated on :25 October 2024,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Ys Sharmila : తండ్రి నుండి ష‌ర్మిళ‌కి వ‌చ్చిన ఆస్తులెన్ని.. జ‌గ‌న్ అద‌నంగా ఎంత ఇచ్చారు..!

Ys Sharmila : ప్ర‌స్తుతం ఏపీలో జ‌గ‌న్, ష‌ర్మిళ‌ల ఆస్తి పంప‌కాల వ్య‌వ‌హారం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జగన్‌, షర్మిల మధ్య నలుగుతున్న ఆస్తి పంపకాల వివాదం, షర్మిల లేఖలు రాయడం, ఎన్సీఎల్‌టీని జగన్‌ ఆశ్రయించడం… వీటన్నింటి పైనా వైసీసీ నేత పేర్ని నాని స్పందించారు. వారసత్వ ఆస్తి చట్టం ప్రకారం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి బతికున్నప్పుడే జగన్‌కు షర్మిలకు ఆస్తి పంపకాలు జరిగిపోయాయని ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆ తర్వాత తన స్వార్జితపు ఆస్తిలో కూడా చెల్లి షర్మిలకు జగన్‌ వాటా ఇచ్చారని లెక్కలతో సహా చెప్పారు వైసీపీ సీనియర్ నేత. అయితే ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల విషయంలో… షర్మిల మార్పులుచేర్పులు చేయడంతో వివాదం మొదలైందంటున్నారు వైసీపీ నేత పేర్ని నాని.

Ys Sharmila ఆస్తుల‌పై క్లారిటీ..

వైఎస్ మరణానికి ముందే ఆయన ఆస్తులను పంపకాలు చేసారని చెప్పుకొచ్చారు. అందులో భాగంగా షర్మిలకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో 280గజాల స్థలం, ఇడుపులపాయలో 51 ఎకరాల పొలం ఇచ్చారని పేర్ని నాని వివరించారు 15మెగావాట్ల సండూర్‌ హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్, స్మాల్‌ హైడ్రో ప్రాజెక్టుల లైసెన్సులు, 22.5 మెగావాట్ల స్వాతి హైడ్రో పవర్‌ ప్రాజెక్టులో వాటాలు, విజయవాడ రాజ్‌ – యువరాజ్‌ థియేటర్‌లో 35 శాతం వాటా, పులివెందులలో మరో 7.6 ఎకరాల భూమి, విజయలక్ష్మి మినరల్స్ ట్రేడింగ్ కంపెనీలో వంద శాతం వాటాలు దక్కాయి. ఆస్తులు కాకుండా భారతి సిమెంట్స్‌, సరస్వతి పవర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌, మీడియా వ్యాపారసంస్థలన్నీ జగన్‌ స్వార్జితం అన్నారు పేర్ని నాని.

Ys Sharmila తండ్రి నుండి ష‌ర్మిళ‌కి వ‌చ్చిన ఆస్తులెన్ని జ‌గ‌న్ అద‌నంగా ఎంత ఇచ్చారు

Ys Sharmila : తండ్రి నుండి ష‌ర్మిళ‌కి వ‌చ్చిన ఆస్తులెన్ని.. జ‌గ‌న్ అద‌నంగా ఎంత ఇచ్చారు..!

షర్మిలపై జగన్‌కు ప్రేమ లేకుంటే ఈడీ అటాచ్‌మెంట్‌లో ఉన్న తన ఆస్తులు, వ్యాపారాల్లో వాటాలను ఆమెకు జగన్‌ ఎలా రాసిస్తారని ప్రశ్నించారు పేర్ని నాని. షర్మిలకు పెళ్లయిన ఇన్నేళ్లకు, వైఎస్ చనిపోయిన దశాబ్దం తర్వాత, 2019లో తన స్వార్జితపు ఆస్తిలో వాటాలను షర్మిలకు రాసిచ్చారంటే జగన్‌కు ఆమె మీద ప్రేమ ఉన్నట్లా? లేనట్లా అన్నారు పేర్ని. తన తల్లిని చెల్లిని కూర్చోబెట్టి అటాచ్‌మెంట్‌లో ఉన్న ఆస్తుల్లో వాళ్లకు వాటా ఇస్తానంటూ జగన్‌ అండర్‌స్టాండింగ్‌ రాసుకున్నారని పేర్ని వివరించారు. తండ్రి చనిపోయినా ఇన్ని ఏండ్లకు ఎవరైనా ఆస్తులు పంచుతారా..? ప్రశ్నించారు. షర్మిలకు ఇవ్వాల్సిన ఆస్తులను ఇప్పటికే జగన్ ఇచ్చారు. చంద్రబాబు తన ఆస్తిలో ఎవరికైనా చెల్లెల్లకు పంచారా..? అని ప్రశ్నించారు.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది