KCR – Perni Nani : ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. దానికి కారణాలు రెండు. ఒకటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ బిడ్డింగ్ అంశం కాగా, మరొకటి ఏపీకి చెందిన కార్మికులను తెలంగాణలో సెటిల్ అవ్వాలని, ఏపీలో ఓట్లు రద్దు చేసుకొని తెలంగాణలో ఓట్లు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు అనడం పెద్ద దుమారమే లేపింది. తెలంగాణలో ఏమున్నదని రావాలి అక్కడికి. తెలంగాణలో ఏముంది అసలు అంటూ ఏపీ మంత్రులు.. తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ఫైర్ అయిన విషయం తెలిసిందే. వాళ్లకు కౌంటర్ గా మంత్రి హరీశ్ రావు కూడా తెలంగాణ ఇది ఉంది..
అది ఉంది అంటూ చెప్పకొచ్చారు. దీంతో మంత్రి హరీశ్ రావుపై మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. కేసీఆర్ ను వెన్నుపోటు పొడిచేందుకు హరీశ్ రావు సిద్ధంగా ఉన్నారంటూ కామెంట్లు చేశారు. కేసీఆర్ ను నేరుగా తిట్టే సత్తా లేక.. తమపై విమర్శలు చేస్తున్నారంటూ హరీశ్ రావుపై పేర్ని నాని నిప్పులు చెరిగారు. కేసీఆర్ పై కడుపుమంటతో హరీశ్ రావు ఉన్నాడు. తనకు ఎప్పుడైనా కడుపు మంట రగిలితే.. మమ్మల్ని తిడతాడు. నిజానికి.. హరీశ్ రావును కేసీఆర్ పట్టించుకోవడం లేదు.
అదే హరీశ్ రావు బాధ, కోపం. మామాఅల్లుళ్ల మధ్య చాలా తగాదాలు ఉన్నాయి. ఏపీపై మీకు ప్రేమ ఉందా? అటువంటప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ను ఎందుకు అడ్డుకున్నారు. నోటితో ప్రేమ చూపిస్తారు.. నొసలతో వెక్కిరిస్తారు. ఇదే కేసీఆర్ నైజం. కేసీఆర్ ను తిట్టకపోతే మళ్లీ హరీశ్ రావు ఫీల్ అవుతారు. హైదరాబాద్ ఏ ఒక్కరు డెవలప్ చేసింది కాదు. అందరు కలిసి డెవలప్ చేస్తే అలా అయింది. దాన్ని చూసి ఇప్పుడు మీరు మురిసిపోతున్నారు. సిద్దిపేట, హైదరాబాద్ అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. మిగితా జిల్లాల పరిస్థితి ఏంటి అంటూ పేర్ని నాని ప్రశ్నించారు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.