Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..!
Rains : గత వారం నుండి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ విషాదం నుండి కోలుకోకముందే రాగల 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఏలూరు, పల్నాడు, N.T.R. మూడూ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నాయన్నారు. అల్లూరి, […]
ప్రధానాంశాలు:
Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు..!
Rains : గత వారం నుండి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఈ విషాదం నుండి కోలుకోకముందే రాగల 24 గంటల్లో పశ్చిమ బంగాళాఖాతం ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణశాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. అల్పపీడన ప్రభావంతో ఉత్తర, దక్షిణ కోస్తాలో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఏలూరు, పల్నాడు, N.T.R. మూడూ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఉన్నాయన్నారు. అల్లూరి, అనకాపల్లి, విశాఖ, కాకినాడ, కోనసీమ, యానం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. నేటి నుంచి 8వ తేదీ వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు.
Rains మరో హెచ్చరిక..
ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. బంగాళాఖాతం లో ఈ నెల 5న మరో అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణశాఖ వెల్లడించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాకు ఆరెంజ్ అలర్ట్.. కాకినాడ, కోనసీమ, యానాం, ఏలూరు, గుంటూరు, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ఇంకా తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట్, మల్కాజిగిరి జిల్లాల్లోనూ వర్షాలు కురుస్తాయని హెచ్చరిస్తోంది.
బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ అధ్యయన నిపుణులు ఓఎస్ఆర్యు భాను కుమార్ తెలిపారు. ఇది వాయుగుండం, తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. ఈ నెల 6, 7, 8, 9 తేదీల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇది రాష్ట్రంలోనే తీరం దాటే అవకాశం 70%, ఒడిశాలో తీరం దాటే అవకాశం 30% శాతం ఉందన్నారు. ఈ అల్ప పీడనం వల్ల ఉత్తర, దక్షిణ కోస్తాలలో వర్షాలు కురుస్తాయని తెలిపారు.ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 59.77 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 83.64 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా సాధారణం కంటే అధికంగా 40% వర్షపాతం నమోదైనట్టుగా వెల్లడించింది. ఇక రానున్న మూడు రోజులు వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తం కావాలని వారు సూచించారు.